Reading Time: < 1 minute
Mahesh Babu Rajamouli Varanasi Movie Antarctica Schedule Priyanka Chopra Ccxp Mexico

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపుదిద్దుకుంటున్న అడ్వెంచరస్ డ్రామా వారణాసి అత్యంత అరుదైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. గత కొద్దిరోజులుగా అంటార్కిటికాలోని మైనస్ డిగ్రీల చలిలో, ఎవరూ ఊహించని లొకేషన్లలో రాజమౌళి అండ్ టీమ్ షూటింగ్ చేస్తున్నారు, భారతీయ సినిమా చరిత్రలో అంటార్కిటికాలో షూట్ జరుపుకుంటున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. మహేష్ బాబు (రుద్ర)కి సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను అక్కడ పూర్తి చేశారు. ఈ షార్ట్ షెడ్యూల్ మరికొద్ది రోజుల్లోనే ముగియనుంది. ఈ సినిమా కథ కాలానికి, ఖండాలకు అతీతంగా సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే సుదీర్ఘమైన కాశీ షెడ్యూల్‌ను పూర్తి చేసిన టీమ్, అక్కడి ఆధ్యాత్మికతను కెమెరాలో బంధించింది. ఆ తర్వాతే ఈ గ్లోబల్ అడ్వెంచర్ అంటార్కిటికా వైపు మళ్లింది.

తాజా సమాచారం ప్రకారం, మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(మందాకిని)లపై ఒక భారీ సాంగ్ షూట్ కూడా పూర్తయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటార్కిటికా షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర యూనిట్ చిన్న బ్రేక్ తీసుకోనుంది. ఆ తర్వాత జూన్ నెలలో హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ సెట్‌లో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ గ్యాప్‌లో రాజమౌళి అండ్ టీమ్ మెక్సికోలో జరగనున్న Comic Con (CCXP) ఈవెంట్‌లో పాల్గొనబోతున్నారు.