Reading Time: < 1 minute
Tcs Nashik Harassment Case Team Lead Miscarriage Remarks

TCS Nashik Case: టీసీఎస్ నాసిక్‌ కేసులో నిందితుల అరాచకాలు నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎలా మహిళల్ని వేధించారు, మతమార్పిడులకు పాల్పడ్డారనే విషయాలపై బాధితులు పోలీసులకు చెబుతున్నారు. తాజాగా, ఒక సీనియర్ మహిళా ఉద్యోగి నిందితుల ప్రవర్తనపై ఆరోపణలు చేశారు. తాను ఎదుర్కొన్న వేధింపులపై సంస్థ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. తనకు గర్భస్రావం అయిందని తెలిసి, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించింది.

గత 11 ఏళ్లుగా ఆ సంస్థలో పనిచేస్తున్నట్లు బాధిత మహిళ చెప్పుకొచ్చింది. 2026 ఫిబ్రవరిలో నిందితుడు తౌసిఫ్ అత్తర్ తన వద్దకు వచ్చి తన ఆరోగ్యం గురించి అడిగాడని, ఇటీవల గర్భస్రావం కావడంతో అనారోగ్యంతో ఉన్నట్లు చెప్పానని మహిళ చెప్పింది. బిడ్డలు కలగాలంటే అజ్మీర్‌లోని ఒక మౌల్వీ వద్దకు వెళ్లాలని సూచించినట్లు, తన వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించింది. ఆ వ్యాక్యల్ని అవమానకరమైన, అనుచితమైన వ్యాఖ్యలుగా ఆమె అభివర్ణించింది.

Read Also: USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..

అత్తర్ తన వైవాహిత జీవితం, సంతానం లేకపోవడంపై పదే పదే వ్యాఖ్యలు చేసి, మానసికంగా వేధించినట్లు చెప్పింది. నిందితులైన డానిష్ షేక్, తౌసిఫ్, రజా మెమన్, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి,ఆసిఫ్ అన్సారీ తనకు వ్యక్తిగతంగా తెలుసని, వారు తనలో అనుచితంగా ప్రవర్తించినట్లు చెప్పింది. ఈ నిందితులు హిందూ ఉద్యోగుల్ని టార్గెట్ చేసేవారిని ఆరోపించింది. మత విశ్వాసాలు, విగ్రహాలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం, మహిళా ఉద్యోగులను లైంగికంగా రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యలు చేసే వారని చెప్పింది. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సంస్థ చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.

2022లో షఫీ షేక్ అనే నిందితులు తన ఛాతి వైపు తదేకంగా చూస్తూ, అనుచితంగా నవ్విన ఘటనను గుర్తు చేసుకుంది. ఆ చూపులు భరించలేక బయటకు గదిలో నుంచి బయటకు వెళ్లినట్లు బాధితురాలు చెప్పింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 9 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.