
ఈ రోజుల్లో చాలా మధ్యతరగతి కుటుంబాలకు కారు అనేది లగ్జరీకి కాదు, తప్పనిసరిగా ఉండాల్సినది. మీ దగ్గర ఖర్చు చేయడానికి సుమారు రూ. 3.5 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు ఉన్నట్లయితే, మీరు కొనగలిగే కొన్ని బెస్ట్ కార్ అప్షన్స్ ఉన్నాయి. ఈ కార్లు తక్కువ ఇంధనాన్ని వినియోగించడమే కాకుండా తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది. అలాగే బెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో వస్తాయి. భారతదేశంలో మారుతి సుజుకి నుండి టాటా వరకు అన్ని సౌకర్యాలతో అందించే ఈ ఐదు బడ్జెట్-ఫ్రెండ్లీ ఫ్యామిలీ కార్స్ గురించి మీకోసం….
మారుతి సెలెరియో
మీరు ఇంధనం ఆదా చేయాలనుకుంటే మారుతి సుజుకి సెలెరియో ఒక బెస్ట్ అప్షన్. ఈ కార్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ సుమారు 25 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది, CNG మోడల్ అయితే 34 కిలోమీటర్ల మైలేజీని కూడా అందుకోగలదు. నడపడానికి, హ్యాండిల్ చేయగలగడం చాల ఈజీ.. నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉండటం వల్ల రెగ్యులర్ డ్రైవింగ్‌కు చాలా బాగుంటుంది.
టాటా టియాగో
ఈ ధరల్లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న టాటా టియాగో నిజంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ కార్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మీకు దాదాపు 19 kmpl మైలేజీని ఇస్తుంది, CNG వెర్షన్ దాదాపు 28 km/kg మైలేజీ ఇస్తుంది. అంతేకాకుండా ఈ కారు దృఢంగా నిర్మించబడింది, మంచి ఫీచర్లతో ఇంటీరియర్ భాగం ఒక చిన్న ఫ్యామిలీకి సౌకర్యవంతంగా ఉంటుంది.
రెనాల్ట్ క్విడ్
రెనాల్ట్ క్విడ్ ఒక చిన్న SUV లాగా కనిపిస్తుంది, కానీ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఈ కార్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది అలాగే సుమారు 21–22 kmpl మైలేజీని ఇస్తుంది. మీకు స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా కనిపించే, బడ్జెట్ ఫ్రెండ్లీ కారు కావాలంటే, ఈ అధిక రోడ్ క్లియరెన్స్ ఉన్న కారు ఒక గొప్ప ఛాయిస్.
మారుతి ఆల్టో K10
మారుతి సుజుకి ఆల్టో K10 ఇండియాలో అత్యంత నమ్మకమైన కార్లలో ఒకటి. దీని 1.0-లీటర్ ఇంజన్ పెట్రోల్‌తో 24–25 kmpl మైలేజీ, CNGతో ఆకట్టుకునే 33–34 km/kg మైలేజీ అందిస్తుంది. ఈ కారు చిన్నగా, చవకగా ఉండటమే కాకుండా, మారుతికి గొప్ప సర్వీస్ నెట్‌వర్క్ కూడా ఉంది. అందుకే మొదటిసారి కారు కొనే వారికి ఇది అత్యంత ఇష్టమైనదిగా నిలుస్తుంది.
మారుతి ఎస్-ప్రెస్సో
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మీరు కొనగలిగే అత్యంత చవకైన కార్లలో ఒకటి, దీని ధర సుమారు రూ. 3.5 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారు 1.0-లీటర్ ఇంజన్ పెట్రోల్‌తో లీటరుకు సుమారు 24 కిలోమీటర్లు, CNGతో కిలోకి 32 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. దీని సిటు ఎత్తు ఆకారం కారణంగా, మీ తలపైన ఎక్కువ స్థలం, మంచి వ్యూ అందిస్తుంది. అందువల్ల సిటీ నగరాల్లోని కుటుంబాలకు ఒక గొప్ప కారుగా నిలుస్తుంది.