
మైగ్రేన్ అనేది తీవ్రమైన తలనొప్పి. తలలో ఒక వైపున గుచ్చుతున్నట్లుగా ఉండే నొప్పి కలుగుతుంది. కొందరిలో ఇది గంటల తరబడి, రోజుల తరబడి కూడా ఉంటుంది. ఇది కేవలం తలనొప్పి మాత్రమే కాదు. వాంతులు, వికారం, కాంతి- శబ్దాల వినలేకపోవడం, చూడలేకపోవడం వంటి లక్షణాలు కలిగించే ఒక నాడీ వ్యవస్థ సమస్య. మైగ్రేన్ రావడానికి కారణమేమిటో? రోజువారీ అలవాట్లు ఈ సమస్యలను ఎలా పెంచుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
మైగ్రేన్ ఎందుకు వస్తుంది?
నిపుణుల అభిప్రాయం ప్రకారం మెదడులోని రసాయన మార్పులు, ముఖ్యంగా సెరోటోనిన్ స్థాయిలు తగ్గడం వల్ల నాడీ వ్యవస్థ మరింత సున్నితంగా మారుతుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది. ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు, అధిక కాంతి, శబ్దం కొన్ని రకాల ఆహారాలు (చాక్లెట్, కెఫిన్) మైగ్రేన్ల ప్రమాదాన్ని పెంచుతాయి.
ఈ తప్పులు చేస్తే నొప్పి మరింత పెరుగుతుంది
తగినంత నిద్ర లేకపోవడం
నిద్రలేమి మెదడుకు విశ్రాంతిని ఇవ్వదు. దీనివల్ల మైగ్రేన్ల ప్రమాదం పెరగవచ్చు. ప్రతిరోజూ 7–8 గంటల నిద్రపోవడం చాలా అవసరం.
అధిక శబ్దం – కాంతికి గురికావడం
అధిక శబ్దం లేదా కాంతి ఉన్న ప్రదేశాలలో ఉండటం వలన మైగ్రేన్లు ప్రేరేపించబడతాయి. నిశ్శబ్ద వాతావరణంలో సమయం గడపడం ఉత్తమం.
ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండటం
ఎక్కువసేపు ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలోని శక్తి స్థాయిలు తగ్గిపోతాయి. దీనివల్ల మైగ్రేన్లు పెరగవచ్చు. అందువల్ల క్రమం తప్పకుండా సమతుల్య ఆహారం తీసుకోవాలి.
అధిక కెఫీన్ తీసుకోవడం
అధికంగా కాఫీ లేదా టీ తాగడం వల్ల నిద్ర విధానాలు మారవచ్చు. ఇది మైగ్రేన్‌లు పెరగడానికి దారితీయవచ్చు.
నియంత్రణకు ఏం చేయాలి?
మైగ్రేన్‌ను నియంత్రించడానికి క్రమమైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి నిర్వహణ, వ్యాయామం చాలా ముఖ్యం. అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం మంచిది. లేకపోతే అది దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చు. కాబట్టి సరైన జీవనశైలిని అలవర్చుకోవడం, కొన్ని ఆహార అలవాట్లను నివారించడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. ఆరోగ్యకరమైన అలవాట్లు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.