
టాలీవుడ్ హీరో అడివి శేష్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ డెకాయిట్. షానీల్ డియో తెరకెక్కించిన ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ మూవీలో విలన్ గా నటించారు. ఏప్రిల్ 10న రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే తాజాగా డెకాయిట్ మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. మూవీ లవర్స్ కు ఊరట కల్పించేలా తమ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అడివి శేష్ ట్విటర్‌లో షేర్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో డెకాయిట్ సినిమా టికెట్ ధరలు తగ్గించారు. ఏపీలోని సింగిల్ స్క్రీన్స్‌లో రూ.105, రూ.70గా ధరలు నిర్ణయించారు. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్‌లో రూ.105, రూ.80, రూ.50గా ఖరారు చేశారు. టీజీలోని అన్ని మల్టీప్లెక్స్‌ల్లో మాత్రం రూ.150గా ఫిక్స్ చేశారు. తగ్గించిన ధరలు ఈనెల 24వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని శేష్ వెల్లడించారు. కాగా.. గతంలో మేజర్ సినిమాకు కూడా ఇదే తరహాలో టికెట్ ధరలు తగ్గించారని ఈ సందర్భంగా గుర్తు చేశాడు డెకాయిట్ హీరో.
అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ ఎస్ క్రియేషన్స్ సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్లపై సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ సంయుక్తంగా డెకాయిట్ సినిమాను నిర్మించారు. ప్రకాశ్ రాజ్ ,సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి భాస్కర్ల, జయన్ మేరీ ఖాన్, జరీనా వాహబ్ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరీలియో ఈ సినిమాకు స్వరాలందించారు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ భాషల్లోనూ రిలీజైంది. మరి మీరు ఇంకా ఈ సినిమాను చూడాలేదా? అయితే లేటెందుకు మరీ ఇప్పుడే టికెట్లను బుక్ చేసుకోండి.
అడివి శేష్ ట్వీట్..
Thank you for all the LOVE
Appudu #MAJOR ki Lowest Ticket Price
Ippudu #DACOIT ki.We called the Theaters and Spoke to them about Lowering Ticket Prices
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ధరల్లో:
ఆంధ్రప్రదేశ్ – ₹105, ₹70
తెలంగాణ – ₹105, ₹80, ₹50… pic.twitter.com/63Cq0H0Q4m
— Adivi Sesh (@AdiviSesh) April 23, 2026

ఆంధ్రప్రదేశ్ – ₹105, ₹70