Reading Time: 2 minutes

ఎల్బీ నగర్ టు హిమాయత్ నగర్..డబుల్ డెక్కర్ కారిడార్ కింద సర్వీస్ రోడ్డు, మధ్యలో నేషనల్ హైవే..ఆపై మెట్రో రైల్

Caption of Image.
  • మోర్త్​ ఇంజినీర్లతో భేటీలో మంత్రి వెంకట్ రెడ్డి వెల్లడి
  • డిటేయిల్డ్​ ఎస్టిమేషన్​ తయారీ చేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఎల్బీ నగర్  నుంచి హయత్ నగర్  వరకు నిర్మించనున్న డబుల్  డెక్కర్ ఎలివేటెడ్  కారిడార్ కు రాష్ట్ర వాటాగా రూ.200 కోట్లు ఇస్తామని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ  ప్రాజెక్టులో ఎల్బీ నగర్​ నుంచి హయత్​నగర్​ వరకు 7.1 కిలోమీటర్ల దూరం నిర్మించే ప్రాజెక్టు కింద సర్వీస్  రోడ్డు, మధ్యలో నేషనల్​ హైవే, పైన మెట్రో రైలు వెళ్లేలా కారిడార్  నిర్మాణం జరగనుందని, రెగ్యులర్  ఎలివేటెడ్  కారిడార్  కన్నా పటిష్టంగా, వెడల్పుగా పిల్లర్లు నిర్మించాల్సిన ఉంటుందని ఈ వార్షిక ప్రణాళికలో పెట్టనున్నట్లు తెలిపారు. ఆ కారిడార్ పై గురువారం సెక్రటేరియెట్​లోని ఆర్​ అండ్ బీ శాఖ  కార్యాలయంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ (మోర్త్) ఇంజినీర్లతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు.​ 

మంత్రి మాట్లాడుతూ కారిడార్​ నిర్మాణానికి సంబంధించి డిటేయిల్డ్​ ఎస్టిమేషన్  తయారీపై చర్చించారు. నేషనల్​ హైవే 65 రూట్లోని ఎల్బీ నగర్  నుంచి హయత్ నగర్  వరకు ట్రాఫిక్​ విపరీతంగా పెరగడంతో యాక్సిడెంట్స్  జరుగుతున్నాయని, ప్రమాదాలను నియంత్రించడానికి ఎలివేటెడ్  కారిడార్  నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ.941 కోట్లు ఖర్చుకానుండగా.. రాష్ట్ర వాటాగా రూ.200 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

ఈ ప్రాజెక్టు వల్ల 54 కాలనీలకు చెందిన సుమారు 20 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని, హైదరాబాద్  నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు సమయం కలిసివస్తుందన్నారు. వచ్చే వారం కేంద్ర మంత్రి నితిన్  గడ్కరీని కలిసి ఈ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని కోరుతానని చెప్పారు. ఎల్బీ నగర్​ నుంచి హయత్​నగర్​ వరకు 7.1 కిలోమీటర్ల దూరం నిర్మించే ప్రాజెక్టును ఈ వార్షిక ప్రణాళికలో పెట్టినట్టు మోర్త్​ రీజినల్​ ఆఫీసర్​ కృష్ణప్రసాద్​ తెలిపారు. కింద సర్వీస్  రోడ్డు, మధ్యలో నేషనల్​ హైవే, పైన మెట్రో రైలు వెళ్లేలా కారిడార్  నిర్మాణం జరగనుందని, రెగ్యులర్  ఎలివేటెడ్  కారిడార్  కన్నా పటిష్టంగా, వెడల్పుగా పిల్లర్లు నిర్మించాల్సిన ఉంటుందని చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.