
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ – దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి మేకర్స్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. 2027 ఈద్ కానుకగా సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ముహూర్తం వీడియోను కూడా విడుదల చేశారు.
సల్మాన్ ఖాన్ తన ‘X’ ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. “కొంచెం ముందుచూపుతో ఆలోచించాలి.. అందుకే ఈద్‌ను ప్రకటించాను. ఆందోళన చెందకండి, సరైన సమయం వచ్చినప్పుడు మరిన్ని వివరాలు చెబుతాం. ఓపికగా ఉండండి. ఇంకో డేట్ కూడా త్వరలో వెల్లడిస్తాం. నేను ఎంతసేపు వేచి ఉంటానో, మీరు కూడా అంతసేపే వేచి ఉండాలి. ఏదేమైనా, మీరు ఎలా ఉన్నారో.. నేను కూడా అలాగే ఉన్నాను” అంటూ సల్మాన్ తనదైన శైలిలో రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
Thoda durr ki sochna chahiye, That’s why announced Eid….. Don’t worry iss wali ka bhi bataenge, when the time is right……
Patience, thoda sa sabar……
Mere Jitna he intezar karna padega,
Baherhaal jo apka haal hai wo hi mera bhi haal hai…. haha 🙏#Nayanthara… pic.twitter.com/nMGrfOj3DF— Salman Khan (@BeingSalmanKhan) April 24, 2026
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ SVC63 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలోని ఎస్.ఆర్.పి.ఎఫ్ (SRPF) మైదానంలో ఈ సినిమాకు ప్రత్యేకంగా భారీ సెట్ నిర్మించారు. షూటింగ్ తొలి రోజే సల్మాన్ ఖాన్, నయనతారల మధ్య కీలక సన్నివేశాలను దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రీకరించారు.
The Queen Arrives 🔥
The epitome of versatility and excellence #NAYANTHARA joins #SalmanKhanVamshiPaidipallyFilm 💥💥
It’s an honour to have You on board for something truly special that’s underway 🙏🏻#SVC63 @BeingSalmanKhan @directorvamshi #DilRaju #Shirish @SVC_official… pic.twitter.com/sRtMdUBsBI
— Sri Venkateswara Creations (@SVC_official) March 31, 2026
ఈద్ 2027 లక్ష్యంగా..
ఈ చిత్రంలో అనిల్ కపూర్, అరవింద్ స్వామి వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాను సుమారు మూడు నెలల పాటు ముంబైతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో షూట్ చేయనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, 2027 ఈద్ (Eid) కంటే ముందుగానే వచ్చే ఛాన్స్ ఉంది. సల్మాన్ మాస్ ఇమేజ్, వంశీ పైడిపల్లి క్లాస్ మేకింగ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.