Reading Time: 2 minutes
Jabardasth: అందరూ నాకు సపోర్ట్ చేశారు.. కానీ వారే.. జబర్దస్త్‌ వదిలేయడానికి అసలు కారణం చెప్పిన సౌమ్యారావు

జబర్దస్త్ లో ఉన్నది కొద్ది రోజులైనా బాగా ఫేమస్ అయ్యిది సౌమ్యారావు. స్టార్ యాంకర్ అనసూయ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి వచ్చిన సౌమ్య కొద్ది రోజుల పాటు షోను బాగానే నడిపించింది. ముఖ్యంగా తన వచ్చీరాని తెలుగు డైలాగులతోనే ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. అయితే ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా ఆమెను షో నుంచి తప్పించారు. దీనిపై రకరకాల రూమర్లు వచ్చాయి. హైపర్ ఆది లాంటి స్టార్ కమెడియన్ల కారణంగానే సౌమ్యా రావు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిందన్న ప్రచారం జరిగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదంటోందీ స్టార్ యాంకర్. తాజాగా ఓ టాక్ షోకు హాజరైన ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే జబర్దస్త్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘జబర్దస్త్ లో నాకు ప్రియాంక సింగ్, సత్య శ్రీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వారు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. నూకరాజు, బుల్లెట్ భాస్కర్, శాంతి అందరూ జబర్దస్త్ లో నాతో చాలా బాగా ఉన్నారు. నేను ఎవరితోనూ గొడవలు పెట్టుకోలేదు. ఎవరూ కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. నాకు తెలుగు సరిగ్గా రాకపోయినా నాకు తెలుగు నేర్పించి మరీ నన్ను ఎంకరేజ్ చేశారు. ఇక నేను జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా చాలా మంది నాకు ఫోన్ చేశారు. నన్ను చాలా మిస్ అవుతున్నామని చప్పారు. నిజం చెప్పాలంటే.. ఏ ఒక్క రోజు కూడా నన్ను వాళ్లు ఇబ్బంది పెట్టలేదు’ అని సౌమ్యా రావు చెప్పుకొచ్చింది.

కాగా జబర్దస్త్ ప్రొడక్షన్ హౌస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది సౌమ్యా రావు. ‘వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నచ్చలేదేమో.. బిజినెస్ మైండ్ కదా.. వాళ్ల ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదా. నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని సత్యాలు ఉంటాయి. అవన్నీ బయటకు చెప్పకపోవడమే మంచిది. ఒక వేళ చెబితే మనకు నష్టమే తప్పితే పెద్దగా ప్రయోజనం లేదు’ అని సౌమ్యా రావు తెలిపింది. ప్రస్తుతం జబర్దస్త్ గురించి ఈ యాంకర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సౌమ్యారావు లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Sowmya Rao (@sowmya.sharada)

 

View this post on Instagram

 

A post shared by Sowmya Rao (@sowmya.sharada)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.