
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమాల్లో క్లాసిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సినిమా డార్లింగ్ సినిమా ఒకటి. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్, ఆయన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 2010లో విడుదలైన ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అప్పటివరకూ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో ఆకట్టుకున్న ప్రభాస్ డార్లింగ్ సినిమాతో లవర్ బాయ్ గా మారిపోయారు. ఈ సినిమాతో అమ్మాయిల ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ విడుదలై 16ఏళ్లు అవుతుంది. తాజాగా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు మేకర్స్.
ఇది కూడా చదవండి : గుండు వెనక అసలు కారణం ఇదే.. కన్నీళ్లు పెట్టిస్తున్న రమణ గోగుల ఎమోషనల్ స్టోరీ
డార్లింగ్ రీ రిలీజ్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. థియేటర్స్ లో ఫ్యాన్ రచ్చ రచ్చ చేస్తున్నారు. కాగా డార్లింగ్ సినిమాలో చాలా మంది కీలక పాత్రల్లో నటించారు. శ్రద్ధాదాస్, ప్రభు, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ రెడ్డి ఇలా చాలా మంది నటించి మెప్పించారు. అయితే డార్లింగ్ సినిమాలో ప్రభాస్ చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా.? చంద్రమోహన్ కూతురిగా నటించింది ఆమె.. అయితే ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది. ఎలా ఉంది అంటూ గూగుల్ లో గాలిస్తున్నారు నెటిజన్స్.
ఇది కూడా చదవండి : చూసుకోవాలికదమ్మా..!! అడ్డంగా దొరికిపోయిన సింగర్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆమె పేరు శిల్పా. డార్లింగ్ సినిమాతో పాటు రెండు, మూడు సినిమాలు చేసింది ఈ అమ్మడు. కానీ ఆమె ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. గుర్తింపు పెద్దగా రాకపోవడంతో మెల్లగా సినిమాలకు దూరం అయ్యింది ఆమె పెళ్లి చేసుకుని.. తన ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. అయితే ఆమె లేటెస్ట్ ఫోటోలు ఎక్కడా లేవు కానీ పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి : 60మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా టచ్ చేయని రికార్డ్ ఆయనది
Shilpa