
సీబీఎస్ఈ 2026 సంవత్సరానికి గాను 10వ తరగతి సెకండ్ సెషన్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్షలు మే 15 నుండి మే 21 వరకు ఒకే షిఫ్ట్‌లో జరగనున్నాయి. సీబీఎస్ఈ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ పరీక్షల ద్వారా విద్యార్థులకు మరో అవకాశం కల్పించేందుకు సెకండ్ సెషన్ షెడ్యూల్‌ను రూపొందించారు. విద్యార్థులు తమ సబ్జెక్ట్ కోడ్ లు, పరీక్షా సమయం,భాషా, ఐచ్ఛిక పేపర్ల విషయంలో జాగ్రత్తగా సరిచూసుకోవాలని సూచించారు.విద్యార్థులు www.cbse.gov.in నుంచి డేట్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, సబ్జెక్టుల వారీగా పరీక్షల టైంటేబుల్ ను చూసుకోవచ్చు.
CBSE 10వ తరగతి సెకండ్ సెషన్ పరీక్ష తేదీ ,సమయం: మే 15 నుంచి మే 21, 2026 వరకు
వివరణాత్మక పరీక్షల షెడ్యూల్..
మే 15: మ్యాథ్స్ స్టాండర్డ్(041), మ్యాథ్స్ బేసిక్(241)
మే 16: ఇంగ్లీష్ (101, 184)
మే 18: సైన్స్ (086)
మే 19: హిందీ కోర్సు-ఎ (002), ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, ఫ్రెంచ్, జర్మన్, సంస్కృతం (కమ్యూనికేటివ్), మరియు వివిధ ప్రాంతీయ, విదేశీ భాషలు, రిటైల్,టూరిజం వంటి స్కిల్డ్ సబ్జెక్టులు.
మే 20: పెయింటింగ్ (049), సంస్కృతం (122), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (402), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (417)
మే 21: సోషియల్ సైన్స్ (087)