
అమరావతి, ఏప్రిల్ 24: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.EL.Ed) కోర్సులో 2026-27 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్-2026 దరఖాస్తు గడువు రేపటితో ముగుస్తోంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు శుక్రవారం (ఏప్రిల్ 25) రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పాఠశాల విద్యా విభాగం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆసక్తి కలిగిన అభ్యర్థులు తుది గడువులోపు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.
ఏపీ డీఈఈసెట్-2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈఈసెట్)-2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. ఆ అర్హతలు కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.1000 చెల్లించవల్సి ఉంటుంది. డీఈఈఈసెట్‌లో సాధించిన ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో సీట్లు కేటాయిస్తారు. రాత పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తారు. ఇతర వివరాలు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఏపీ డీఈఈసెట్-2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.