
వరంగల్ జిల్లా నర్సంపేటలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన RTC డ్రైవర్ శంకర్ గౌడ్ చనిపోయాడు. ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న శంకర్ గౌడ్ గురువారం (ఏప్రిల్ 23) ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది మంటలు ఆర్పివేసి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా చనిపోయాడు.
నర్సంపేట టౌన్‌కు చెందిన కోల శంకర్‌గౌడ్ (56) నర్సంపేట డిపోలో డ్రైవర్‌గా గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. రెండు రోజులు గా జరుగుతున్న సమ్మెలో పాల్గొన్న ఆయన గేట్ దగ్గర ధర్నాలో పాల్గొన్నాడు. మధ్యాహ్నాం మూడున్నర గంటల ప్రాంతంలో డిపోకు ఎదురుగానే ఉన్న బస్టాండ్ ప్రాంగణంలోకి వచ్చి ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు.
►ALSO READ | నర్సంపేట బస్టాండ్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
శంకర్ గౌడ్ ను హుటాహుటీన వరంగల్ ఎంజీఎంకు తరలింంచారు. పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి హైద్రాబాద్‌కు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. నిమ్స్ ఆసుపత్రికి తరలించే లోపే కర్మన్‌ఘాట్ వద్ద చనిపోయాడు. డెడెబాడీని కంచన్‌బాగ్ డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ శంకర్ మృతితో వరంగల్ జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య అంగవైకల్యంతో బాధపడుతూ ఉంది.