Reading Time: < 1 minute
Mlc Ananthababu Bail Cancellation Hearing Today Police Search Intensifies

ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై ఇవాళ రాజమండ్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టులో విచారణ జరగనుంది. సాక్షులను బెదిరించి బెయిల్ షరతులు ఉల్లంఘించారని పోలీసులు రెండు రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అనంతబాబు కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. మరోవైపు అనంతబాబును తక్షణమే అరెస్టు చేయాలంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు, ఎమ్మార్పీఎస్ నేతలు ఆందోళనలు చేపట్టారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2022 మే నెలలో జరిగిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ కేసులో నవంబర్ 30 లోపు తుది తీర్పు ఇవ్వాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.‌ ఈ నేపథ్యంలో రాజమండ్రి జిల్లా కోర్టులో సాక్షుల విచారణ ప్రారంభం కానుంది. అయితే సాక్షులను ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన అనుచరుల ద్వారా బెదిరింపులకు పాల్పడి.. డబ్బులు ఆశ చూపారని కాకినాడ సర్పవరం పోలీసులు ఈనెల 21న కేసు నమోదు చేశారు. దీంతో అనంతబాబు మరోసారి అరెస్టు అవుతారా?, ఆయన బెయిల్ రద్దు పిటిషన్‌పై న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనే ఉత్కంఠ నెలకొంది.