Reading Time: < 1 minute
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్‌ టాపర్‌

రాజస్థాన్‌లో ఓ అవినీతి అధికారిణి ఏసీబీ చేతికి చిక్కింది. భూవ్యవహారానికి సంబంధించిన దందాలో రూ. 60 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా అధికారులకు పట్టుబడింది. గతంలో తను ఇచ్చిన ఓ ఇంటర్వూలో అవినీతిని అంతమెుందిస్తానంటూ ప్రగల్భాలు పలికిన ఈ లేడీ ఆఫీసర్ ఇప్పుడు తనే లంచం తీసుకుంటూ పట్టుబడడంతో చర్చనీయాంశమైంది. రాజస్థాన్‌లో ఎస్‌డీఎమ్‌గా విధులు నిర్వహిస్తున్న కాజల్‌ మీనా భూవ్యవహారానికి సంబంధించిన కేసు పరిష్కారం కోసం ముందు రూ. లక్ష డిమాండ్ చేసింది. అయితే బాధితులు అంత చెల్లించలేమనడంతో రూ. 60 వేలకు డీల్‌ కుదిరింది. అయితే బాధితుడు ఏసీబీకి తెలియచేయడంతో పక్కా ప్లాన్‌ వేసి రెడ్‌హ్యాండెడ్‌గా ఆమెను పట్టుకున్నారు. ఆ సమయంలో ఆమె బ్యాగులో మరో రూ. 4 లక్షలున్నాయని వాటిని కూడా స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. కాజల్‌ మీనా 2024 రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలలో టాపర్‌గా నిలిచారు. అప్పుడామె ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అప్పుడు అవినీతిని నిరోధిస్తానని ప్రజా సేవ చేయడమే లక్ష్యమని ఆమె తెలిపింది. ఇప్పుడు తొలి పోస్టింగ్‌ లోనే లంచం తీసుకుంటూ దొరకడంతో నెటిజన్లు విమర్శిస్తున్నారు. అవినీతిని నిర్మూలిస్తానని ప్రగల్భాలు పలికి తొలి పోస్టింగ్‌లోనే ఏసీబీకి చిక్కడమేంటని ‍ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా చేసింది

విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు

సారీ హేమక్కా.. తప్పు చేశాను.. తమన్నా క్షమాపణ వైరల్ వీడియో

పది రూపాయల స్నాక్‌.. పది కోట్ల వ్యూస్‌

Allu Aravind: బన్నీ అలా ఎందుకు చేస్తాడు..? మీరు విన్నది తప్పు – అరవింద్