Reading Time: 2 minutes

ఆ భయంతోనే ఎక్కడెక్కడోళ్లో వచ్చి ఓటేశారు !

Caption of Image.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోలింగ్ బీభత్సం. అవును.. అలా ఇలా కాదు.. చరిత్ర స్రుష్టించారు ఓటర్లు. పోలింగ్ ముగిసే సమయం 6 గంటలకే.. 94 శాతం ఓటింగ్ నమోదు కావటం హిస్టరీ. ఇంతకీ.. పశ్చిమ బెంగాల్ ఓటర్లు ఇంతలా పోలింగ్ బూతులకు ఎందుకు వెల్లువెత్తారు.. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓట్లు వేశారు. ఎక్కడెక్కడో పనులు చేసుకుంటూ.. ఇతర రాష్ట్రాల్లో వలస కూలీలుగా ఉన్న లక్షల మంది ఈసారి ఓటు కోసం సొంతూళ్లకు ఎందుకు పరుగులు పెట్టారు అనేది చూద్దాం..

దీనికి అంతటికీ కారణం సర్.. SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్). ఈ ఒక్క కారణంగానే బెంగాల్ ఓటర్లు.. తమ ఓటును వినియోగించుకున్నారు. బద్దకం వదిలారు.. ఎవరూ చెప్పకపోయినా.. బాబూ రండి బాబూ రండి అంటూ కబురు చేయకపోయినా.. పోలింగ్ బూతులకు వచ్చి ఓటు వేశారు. సర్.. ఓట్ల తీసివేత.. ఏరివేత విషయంలో పశ్చిమ బెంగాల్ లో జరిగినంత రాద్దాంతం ఎక్కడా జరగలేదు. ఈ సారి ఓటు వేయకపోతే.. రాబోయే ఎన్నికల్లో తమ ఓటు పోతుందనే భయం ఓటర్లలో వచ్చింది. ఇప్పుడు ఓటు వేయకపోతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు తీసేస్తారు.. ఓటు లేకపోతే భారతీయ వ్యక్తిగా నిరూపించుకోవటం కష్టం అనే భయం బెంగాల్ వాసుల్లో ఏర్పడింది. ఈ భయంతో.. ఈసారి అందరూ ఓటు వేశారు. 

►ALSO READ | పోటెత్తిన ఓటర్లు.. సాయంత్రం 5 వరకూ తమిళనాడులో 82 శాతం, బెంగాల్లో 90 శాతం పోలింగ్

బెంగాల్ నుంచి 500, వెయ్యి.. 15 వందలు, 2 వేల కిలోమీటర్ల దూరంలో వలస కూలీలుగా జీవితం సాగిస్తున్న వాళ్లు సైతం.. తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని మరీ వచ్చి ఓటు వేశారు. ఈసారి ఓటు వేయకపోతే.. వచ్చేసారి ఓటు తీసేస్తారంట అనే ప్రచారం విపరీతంగా సాగటం కూడా పోలింగ్ శాతం రికార్డులు బద్దలు కొట్టటానికి కారణం అయ్యింది. దీనికితోడు చనిపోయిన వాళ్ల ఓట్లు తీసేయటం.. డబుల్ ఓట్లు తొలగించటం.. రాష్ట్రం మొత్తంలో ఒకే చోట ఓటు ఉండటం అనే కారణాలు సైతం ఉన్నాయి. దీని వల్ల పోలింగ్ పర్సంటేజ్ గణనీయంగా పెరిగింది. గతంలో కోల్ కతాలో ఉద్యోగం, ఉపాధి పొందే వ్యక్తి కోల్ కతాలో ఓటు తీసుకునే వాడు.. అతని సొంత గ్రామంలోనూ ఓటు ఉండేది.. ఇప్పుడు అలా కాకుండా కోల్ కతాలోని ఓటును రద్దు చేసుకుని.. తన సొంతూరులో ఓటు ఉంచుకున్నాడు. దీని వల్ల ఓటర్ల లిస్టులో ఓట్లు తగ్గాయి.. ఇదే సమయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. సర్.. ప్రభావం ఎక్కువగా ఉంది. 

ఈసారి ఓటు వేయకపోతే.. వచ్చే ఎన్నికల్లో మన ఓటు ఉండదు అనే భయంతో.. ఎక్కడెక్కడివాళ్లు అందరూ వచ్చి పద్దతిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం పెరిగింది. 
ఇదండీ.. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ పర్సంటేజ్ పెరగటానికి కారణం..

©️ VIL Media Pvt Ltd.