అనంతగిరి హిల్స్ : వికారాబాద్ అనంతగిరి హిల్స్ తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒక్కటి. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, అందమైన జలపాతాల మధ్య ఆనందంగా ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. ఇక మే నెలలో ఇక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి ప్రకృతి ప్రేమికులు ఇక్కడి వెళితే ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చును. అంతే కాకుండా, ఇక్కడ పద్మనాభస్వామి దేవాలయం, కోట్ పల్లి, పరిగి దామ గుండం ఇలా చాలా ప్రదేశాలు చుట్టేసి రావచ్చు.
వరంగల్ కోట, రామప్ప : వరంగల్ జిల్లాలో చూడాల్సిన అదమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందువలన సమ్మర్లో పిల్లలతో కలిసి టూర్ ప్లాన్ చేసుకునే వారు ఇక్కడికి వెళితే వారికి ఎన్నో విషయాలను తెలియజేయడమే కాకుండా ఆనందంగా ఎంజాయ్ కూడా చేయవచ్చును. వరంగల్ జిల్లాలో వరంగల్ కోటీ, పాకాల సరస్సు, గూడూరు అభయారణ్యం, అంతే కాకుండా భద్రకాళి అమ్మవారి టెంపు, దీనికి దగ్గరిలో రామప్ప దేవాలయం, లక్నవరం చెరువు, బొగత జలపాతం, ఏటూరునాగారం అభయారణ్యం ఇలా చాలా ప్రదేశాలు చూడొచ్చు.
ఎలగందుల కోట, వేములవాడ దేవస్థానం : చాలా మందికి రాజుల కాలం నాటి కోటలు చూడటం ఇష్టం ఉంటుంది. అయితే సీజన్‌తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేయాలి అనుకునేవారికి ఎలగందుల కోట చాలా బెస్ట్. కాకతీయులు నిర్మించిన అద్భుతమైన కట్టడం ఇది. మానేరు నదీతీరంలో అడవి మధ్యలో ఉండే అతి సుందరమైన కోట ఇది. ఈ కోట నుంచి హైదరాబాద్‌కు సొరంగ మార్గం కూడా ఉందని అక్కడి వారు చెబుతుంటారు. దీని వెనుక అనేక కథలు ఉన్నాయి. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.
చార్మినార్ : హైదరాబాద్ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరూ చార్మినార్ చూడకుండా మాత్రం వెళ్లలేరు. అంత అద్భుతంగా ఉంటుంది. ఇక ఇక్కడ చార్మినార్ మాత్రమే కాకుండా, మక్కా మసీద్, లాల్ బజార్, సాలార్ జంగ్ మ్యూజియం ఇవన్నీ కూడా చూసేయ్యచ్చు.
యాదగిరి గుట్ట : తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల్లో ఒక్కటైన యాదగిరిగుట్ట కూడా ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన ఆలయం. ఇది తెలంగాణలోనే ఫేమస్ టెంపుల్‌గా ప్రసిద్ధి చెందినది. అలాగే దీనికి దగ్గరలో భువనగిరి కోట, బస్వాపూర్, కొలనుపాక, మహదేవపురం ఇలా ఇవన్నీ కూడా చుట్టేసి రావచ్చు.




