Reading Time: < 1 minute
Yogi Adityanath Face Bjp Up Elections 2027 Nitin Naveen Statement

Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్‌కు మరో ఏడాది మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంపై సంచలన ప్రకటన చేసింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యూపీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోనే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఆయన నాయకత్వంలోనే పోటీ చేస్తామని చెప్పారు. ‘‘ప్రస్తుతం యూపీ సీఎం యోగి, ప్రభుత్వం ఆయన నాయకత్వంలోనే నడుస్తోంది. యూపీ ఎన్నికల్లో ఆయనే మా ముఖచిత్రంగా ఉంటారు’’ అని చెప్పారు.

Read Also: Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్‌ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!

ఈ ప్రకటన ద్వారా యూపీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ సీఎం యోగినే ప్రొజెక్ట్ చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి నేతృత్వంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, మరోవైపు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మిషన్ 2027 పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది.

యూపీ ఎన్నికలపై స్పందించిన నితిన్ నబీన్.. ఒకప్పుడు నేరాలు, దోపిడీలకు కేరాఫ్‌గా ఉండే ఉత్తర్ ప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధి, ఎక్స్‌ప్రెస్ వే, శాంతిభద్రతల్లో గుర్తింపు పొందిందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ, సీఎం యోగి నేతృత్వంలో యూపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ప్రజల అసవరాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలే బీజేపీకి ఓట్లు తెప్పిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు.