
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. శుక్రవారం ( ఏప్రిల్ 24 ) సాక్షులను బెదిరించిన కేసులోకోర్టుకు హాజరై వస్తుండగా అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో రాజమండ్రి కోర్టు దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతబాబు అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు వైసీపీ నేతలు. వారందరినీ చెదరగొట్టి అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసు విచారణ అనంతరం అనంతబాబును కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు సహా ఆయన భార్య కూడా నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సాక్షులు అరవ శివప్రసాద్, శబలం పవన్ కుమార్, మణికంఠ, వెంకటేష్ లను అనంతబాబు అనుచరులు ఇటీవల బలవంతంగా తీసుకెళ్లి కాకినాడలోని ఓ అపార్టుమెంట్లో బంధించారు.
ALSO READ : ముత్తోజిపేటలో టెన్షన్: నర్సంపేట డిపోలో నివాళుల అంశంపై కొలిక్కిరాని చర్చలు
అనంతబాబుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని లేకపోతే చంపేస్తామని బెదిరించినట్లు ఆధారాలు లభించిన క్రమంలో అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ఈ పిటిషన్ పై విచారణ అనంతరం కోర్టు బయటకు వచ్చిన అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు.