Reading Time: < 1 minute
Young Directors Next Target Is Dhanush The Star Hero Has Increased His Aggression With Crazy Projects

కోలీవుడ్‌లో జెట్ స్పీడ్‌తో సినిమాలు చేసే హీరో ఎవరంటే ధనుష్. ఒక ప్రాజెక్ట్‌కు గుమ్మడికాయ కొట్టేసేలోపు రెండు మూడు సెట్ చేస్తుంటాడు. మినిమం త్రీ,ఫోర్ మంత్స్‌లో షూట్ కంప్లీట్ చేసేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంటాడు. భారీ ప్రయోగాలు జోలికి వెళ్లకుండా.. కంఫ్టర్ జోన్‌లో మూవీస్ చేస్తూ ఇటు నిర్మాతలు, అటు దర్శకులకు ఫ్రెండ్లీ హీరో అయ్యాడు. అందుకే మిగిలిన హీరోలతో పోల్చుకుంటే అతడి లైనప్ డిఫరెంట్.

ధనుష్ స్పీడే యంగ్ దర్శకులకు వరమైంది. ఓ హిట్ పడగానే ఓ స్క్రిప్ట్ తీసుకుని వాలిపోతున్నారు. మోస్ట్లీ తన దగ్గరకు వచ్చిన డైరెక్టర్స్‌కు ఓకే చేస్తుంటాడు. పోర్ తొజిళ్ సక్సెస్ తర్వాత విఘ్నేశ్ రాజా చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మూవీ ఫినీష్ చేశాడు. అదే కర. ఈ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది సెట్స్‌పై ఉండగానే అమరన్ ఫేం రాజ్ కుమార్ పెరియసామితో ధనుష్ 55 స్టార్ట్ చేశాడు. లబ్బర్ పందు ఫేమ్ తమిళరాసన్ పచ్చముత్తుతో ఓ మూవీకి కమిటైన ధనుష్.. తనకు స్టార్ డమ్ తెచ్చిన మారి సెల్వరాజ్‌తో ఓ మూవీ, వెట్రిమారన్‌తో వడా చెన్నై2 సెట్ చేశాడు. తాజాగా ఈ స్టార్ హీరో కోసం కపుల్ ఫ్రెండ్లీ ఫేమ్ అశ్విన్ చంద్రశేఖర్ కూడా కథ సిద్ధం చేస్తున్నాడట. ధనుష్ ఓకే చెబితే.. యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనుందట. ఇక ఇళయరాజా, అబ్దుల్ కలాం బయోపిక్స్‌కు పూర్తిగా మేకోవర్ అవ్వాల్సిన నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ హోల్డ్ చేసిన ధనుష్.. నిర్మాతగానూ బిజీనే. త్వరలో మళ్లీ మెగాఫోన్ పై ఫోకస్ చేస్తున్నాడట. మృణాల్ ఠాకూర్‌తో లేడీ సెంట్రిక్ ఫిల్మ్ చేయబోతున్నాడని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.