Reading Time: < 1 minute

Mitchell Starc: ఢిల్లీ క్యాపిటల్స్ కు కొత్త జోష్ : మిచెల్ స్టార్క్ ఎంట్రీతో గంతులేస్తున్నారు.. 

Caption of Image.

Mitchell Starc: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అభిమానులకు గుడ్ న్యూస్. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న అతడు, త్వరలోనే ఢిల్లీ జట్టుతో కలవనున్నాడు. మోచేయి, భుజం నొప్పితో బాధపడుతున్న స్టార్క్ జనవరి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడంతో.. మే 1వ తేదీన రాజస్థాన్ రాయల్స్ (RR) తో జరిగే కీలక మ్యాచ్‌లో అతను బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

స్టార్క్ ఫామ్ అదుర్స్:
గతేడాది యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై నిప్పులు చెరిగే బంతులతో అత్యధిక వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన స్టార్క్, ఇప్పుడు ఐపీఎల్‌లోనూ అదే పంజా విసరాలని చూస్తున్నాడు. 2025 సీజన్‌లో ఢిల్లీ తరపున 11 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కాగాప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మిశ్రమ ఫలితాలతో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌లలో మూడింట్లో గెలిచి మరో 3 మ్యాచులలో ఓడిపోయింది. 

►ALSO READ | కాసేపట్లో MI vs CSK  హైవోల్టెజ్ పోరు.. ఈరోజు గెలిచేది మాత్రం పక్కా ఆ జట్టే!

సన్‌రైజర్స్‌లోకి ప్యాట్ కమిన్స్:
మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఐపీఎల్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు. అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తరపున త్వరలోనే తన మొదటి మ్యాచ్ ఆడబోతున్నాడు. స్టార్క్, కమిన్స్ లాంటి మేటి బౌలర్లు లీగ్‌లోకి ప్రవేశిస్తుండటంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.  

©️ VIL Media Pvt Ltd.