Reading Time: 2 minutes

Rajpal Yadav: 12 ఏళ్ల గ్యాప్ ఉన్నా.. నాకు అప్సరసలాంటి భార్య దొరికింది: మనసు విప్పిన కామెడీ కింగ్

Caption of Image.

బాలీవుడ్ వెండితెరపై తనదైన మేనరిజమ్స్తో కోట్ల మంది ప్రేక్షకుల్లో నవ్వులు పూయించారు నటుడు రాజ్ పాల్ యాదవ్. ‘చుప్ చుప్ కే’, ‘హంగామా’ వంటి చిత్రాలతో కామెడీ కింగ్‌గా గుర్తింపును సొంతం చేసుకున్నారు. లేటెస్ట్గా నటుడు రాజ్ పాల్ యాదవ్, ఓ మీడియాతో తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భార్య రాధా యాదవ్తో తన ప్రేమకథ కెనడాలోని కాల్గరీలో మొదలై, కాలక్రమేణా బలమైన బంధంగా మారిందని తెలిపారు. ఇద్దరి మధ్య సుమారు 10–12 సంవత్సరాల వయస్సు తేడా ఉన్నప్పటికీ, అది వారి సంబంధంపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఆయన స్పష్టం చేశారు.

అప్సరసలాంటి భార్య..

తన కుటుంబ సభ్యులు సరదాగా “లంగూర్ కో హూర్ మిల్ గయీ” (సాధారణ వ్యక్తికి అప్సరసలాంటి భార్య దొరికింది) అని చెప్పిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, తనకూ అదే భావన ఉండేదని నవ్వుతూ చెప్పారు. భార్యను “అప్సరసలాంటి అమ్మాయిగా” అభివర్ణించిన ఆయన, ఇప్పటికీ తన దుస్తులను కూడా ఆమెనే ఎంపిక చేస్తుందని వెల్లడించారు. ఆమెకు ఐదు భాషలు తెలుసని, నిజాయితీగా మాట్లాడే స్వభావం ఉందని ప్రశంసించారు.

రాజ్‌పాల్ యాదవ్ మాట్లాడుతూ, “మేము కెనడాలోని కాల్గరీలో కలిశాం. ఉత్తరప్రదేశ్లో ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన నాకు అక్కడ జీవిత భాగస్వామి దొరుకుతుందని ఊహించలేదు. కానీ ఆ క్షణం చాలా అందంగా మారింది. అప్పట్లో ఇంత అందమైన భార్య.. నా జీవితానికి వెన్నుముక అవుతుందని నాకు తెలియదు. మా మేనత్త ‘లంగూర్ కో హూర్ మిల్ గయీ’ అని చెప్పేది, నేను కూడా అలాగే భావించేవాడిని” అని అన్నారు.

ALSO READ : విజయ్ దేవరకొండ – శ్రీలీల మధ్య అదిరిపోయే కెమిస్ట్రీ..

10–12 ఏళ్ల గ్యాప్ ఉన్నా..

ఇంకా రాజ్‌పాల్ మాట్లాడుతూ, “నేను ఆమెను చాలా గౌరవిస్తాను. మా మధ్య 10–12 ఏళ్ల గ్యాప్ ఉన్నా, మా కమ్యూనికేషన్ చాలా బలంగా ఉంది. మేము కలిసినప్పుడు ఆమె హిందీ నాకంటే బాగా మాట్లాడేది. ఆమెకు ఐదు భాషలు తెలుసు. నా స్నేహితులు ‘ఇంత మంచి అందమైన అమ్మాయిని ఎలా సాధించావు?’ అని ఇప్పటికీ అడుగుతుంటారు. అదంతా నా అదృష్టం. ఇప్పటికీ నా బట్టలు కూడా ఆమెనే కొనిపెడుతుంది. ఆమె ఎంపికలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆమె నా ఖర్చులన్నింటినీ చూసుకుంటుంది” అని రాజ్‌పాల్ ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. రాజ్‌పాల్ యాదవ్ మొదటి భార్య అనారోగ్య కారణాల వల్ల మరణించారని సమాచారం. 

తీహార్  జైలు గదుల్లో.. 

ఇకపోతే, రెండు నెలల క్రిందట.. రాజ్‌పాల్ యాదవ్ కొన్ని రోజులు తీహార్  జైలు గదుల్లో గడపాల్సి వచ్చింది. దాదాపు రూ. 9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో జనులు జీవితం గడిపాడు. ప్రస్తుతం, ఆయనకు షరతులతో కూడిన బెయిల్ తో బయటికొచ్చాడు. అయితే, రాజ్‌పాల్ యాదవ్ జైలు పాలవ్వడంతో బాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా కదిలింది. సహనటుడి కష్టాన్ని చూసి దిగ్గజ హీరోలు, దర్శకులు ఆర్థికంగా అండగా నిలిచారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, సోనూ సూద్ లు ముందుండి రాజ్‌పాల్ యాదవ్‌ను గట్టెక్కించేందుకు భారీ ఆర్థిక సాయం అందించినట్లు సమాచారం.

సినిమాలు.. 

నటుడు రాజ్‌పాల్ యాదవ్.. హిందీతో పాటుగా మరాఠీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ, తెలుగు భాషల్లో నటించారు. బాలీవుడ్ లో ‘భూల్‌ భూలయ్య’, ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’, ‘బేబీజాన్‌’, ‘హంగామా’, భూత్ బంగ్లా వంటి భారీ ప్రాజెక్ట్స్ లో నటించి గుర్తింపు పొందారు. తెలుగులో రవితేజ నటించిన ‘కిక్‌ 2’తో ఎంట్రీ ఇచ్చారు. 

©️ VIL Media Pvt Ltd.