
హైదరాబాద్ సిటీ, వెలుగు: పాత ఫోన్లు, ఖరాబైన కంప్యూటర్లు, వైర్లతో పర్యావరణానికి ముప్పు రాకుండా జీహెచ్ఎంసీ ఈ-వేస్ట్ ఎకో సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా అమీర్‌పేటలోని హ్యాపీ, బిగ్- సీ ఎలక్ట్రానిక్ స్టోర్లలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఎర్త్ సెన్స్ రీసైక్లర్ ప్రతినిధులతో కలిసి డ్రాప్ -బాక్సులను గురువారం ప్రారంభించారు.
అలాగే, బిగ్ సీ, బి-న్యూ, హ్యాపీ, లాట్, సంగీత, సెలెక్ట్, టచ్ లాంటి మొబైల్స్టోర్స్లో 30 ప్రత్యేక డ్రాప్ -బాక్సులను ఏర్పాటు చేశారు. ప్రజలు పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులను ఇక్కడ ఇవ్వొచ్చు. అలా ఇచ్చిన వారికి ప్రశంసాపత్రాలు, రివార్డ్ పాయింట్లు ఇస్తారు. ఈ పాయింట్లను శిల్పారామంలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్స్టాల్స్, ఇతర ఎంపిక చేసిన కేంద్రాల్లో వస్తువులు కొన్నప్పుడు డిస్కౌంట్పొందవచ్చన్నారు.
సెన్సస్ సెంటర్ పరిశీలన
బంజారాహిల్స్ సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజక్ లో ఏర్పాటు చేసిన జనాభా గణన (సెన్సస్) శిక్షణ కేంద్రాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గురువారం సందర్శించారు. ట్రైనింగ్ జరుగుతున్న తీరును, ట్రైనీలకు కల్పించిన వసతులను ఆయన పరిశీలించారు. శిక్షణ పొందుతున్న సిబ్బందితో మాట్లాడారు.