Reading Time: < 1 minute
Ram Charans Peddi Release Date Locked Mega Power Star To Hit Screens On June 25

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. అయితే ఈ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతునే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ భారీ బడ్జెట్ స్పోర్ట్స్ డ్రామా రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ఏప్రిల్ 30న ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా.. విడుదలను జూన్ నెలకు వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ క్రమంలో జూన్ 4 లేదా జూన్ 25 తేదీల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ రెండు డేట్స్ పరిశీలించిన టీమ్ ఫైనల్‌గా జూన్ 25ను లాక్ చేసారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే ఆలస్యం అని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. ప్రస్తుతం స్పెషల్ సాంగ్ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. ఈ పాటలో రామ్ చరణ్‌తో కలిసి శృతి హాసన్ స్టెప్పులేస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుకున్న స్పెషల్ సాంగ్.. మరింత మాస్‌గా ఉంటుందని టాక్. మరి పెద్ది రిలీజ్ డేట్‌ను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.