
మానవ వనరులపై కృత్రిమ మేధ దాడి అంటే ఇదేనేమో. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో సాఫీగా సాగిపోతుందిలే అనుకున్న ఉద్యోగులు రోడ్డున పడుతుండటం చూస్తుంటే.. మనిషిపై ఏఐ యుద్ధం ప్రకటించిందని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఒకే నెలలో దాదాపు 47 వేల మంది ఉద్యోగులను లేఆఫ్ చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది.
లాస్ట్ మంత్ అంటే 2026 మార్చి.. టెక్ ఇండస్ట్రీలో అల్లకల్లోలం సృష్టించిన నెలగా చెప్పవచ్చు. చిన్నా చితకా కంపెనీల లేఆఫ్స్ కామన్ గా ఉన్నప్పటికీ.. టెక్ జెయింట్స్ అయిన మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్ లాంటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉధ్వాసన పలుకుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఈ మూడు కంపెనీల్లో ఒకే నెలలో 46 వేల 750 మంది ఉద్యోగుల లేఆఫ్స్ జరగటం సాఫ్ట్ వేర్ సెక్టార్ లో పనిచేస్తున్న వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి.
- ఏఐ వినియోగాన్ని డబుల్ చేసిన మెటా.. 8 వేల లేఆఫ్స్
ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని డబుల్ చేసింది. కొత్తగా 8 వేల మందిని ఇంటికి పంపించింది. ఇంతకు ముందు నియమించాలనుకున్న వేల సంఖ్యలో ఉద్యోగుల నియామకాలను కూడా వాయిదా వేసుకుంది. దీనికి కారణం మెటా ఏఐ లో ఈ ఏడాదికి 135 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతుండటమే. ఇది గత మూడేళ్లలో చేసిన పెట్టుబడికి సమానం. పెద్ద సంఖ్యలో ఉండే టీమ్స్ అవసరం లేకుండానే ఏఐ సహకరిస్తుందని.. 2026 మరింత మార్పులు తీసుకొస్తుందని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ ప్రకటించడం గమనార్హం. మెటాలో 2022 నుంచి లేఆఫ్స్ జరుగుతుండగా.. 2023 తర్వాత 2026లో అంతటి స్థాయి లేఆఫ్స్ చేపట్టింది ఆ కంపెనీ
- 30 వేల మందిని తొలగించిన ఒరాకిల్:
ఇటీవలి లేఆఫ్స్ లో ఒరాకిల్ కంపెనీ చేపట్టిన లేఆఫ్స్ అతిపెద్ద చర్చకు దారితీసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే నిద్రలేచే సరికి మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నాం.. అంటూ మెయిల్స్ రావడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 30 వేల మంది ఎంప్లాయిస్ ను తొలగించింది. అయితే తొలగించిన విధానమే ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఎంతో మంది ఉద్యోగులు లింక్డిన్ లో పోస్టులు పెట్టారు. 34 ఏళ్లు ఒరాకిల్ సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు.. రక్తమాంసాలు ధారపోసినందుకు కంపెనీ ఇచ్చిన బహుమానం ఆశ్చర్యానికి గురిచేసిందని నైనా లెవిస్ అనే ఎంప్లాయ్ పెట్టిన పోస్ట్ ప్రపంచాన్ని కదిలించేసిందనే చెప్పాలి. అయితే కంపెనీ ఎంత మందిని తొలగించిందనే విషయం కన్ఫర్మ్ చేయలేదు. కానీ రిపోర్ట్స్ ప్రకారం 30 వేల మందిని తొలగించగా.. ఇండియా నుంచే 12 వేల మందిని ఇంటికి పంపించింది.
ALSO READ : మీకు తెలుసా : రైలు డ్రైవర్ల జీతం ఎంత ఉంటుంది..
- జీతం చెల్లించి సాగనంపిన మైక్రోసాఫ్ట్:
లేఆఫ్స్ విషయంలో మైక్రోసాఫ్ట్ కాస్త డిఫరెంట్ వేలో ముందుకెళ్లింది. ఉద్యోగులకు సడెన్ షాక్ ఇవ్వకుండా.. ఒక్క రోజులోనే రోడ్డున పడేయకుండా వాలంటరీ లేయాఫ్స్ చేపట్టింది. అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 7 శాతం మందిని వాలంటరీగా.. వారి సమ్మతం మేరకు జీతం ఇచ్చి జాబులో నుంచి తొలగించింది. 8750 మంది ఉద్యోగులను సాగనంపింది. కంపెనీ 51 ఏళ్ల చరిత్రలో ఇలాంటి ప్రోగ్రామ్ ద్వారా ఇంతమందని తొలగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. లేఆఫ్స్ లో ఎక్కువగా 70 ఏళ్లకు చేరువైన ఉద్యోగులను ఎక్కవుగా టార్గెట్ చేసింది. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూనే ఉద్యోగాల్లోచి తొలగించింది.