Reading Time: < 1 minute
Nani Ninnu Kori Movie Re Release Date May 8

న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో ఎన్నో హిట్లు ఉండొచ్చు కానీ, ‘నిన్ను కోరి’ సినిమాకు ఉండే స్పెషల్ ఫ్యాన్ బేస్ వేరు. వైజాగ్ యూఎస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో నాని నటన, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేమ, విరహం, పరిణతి (Maturity) అప్పట్లో యూత్‌ను కట్టిపడేసింది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికీ టెలివిజన్, ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధిస్తూనే ఉంది. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ మూవీని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

వేసవి సెలవుల కానుకగా మే 8న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రీరిలీజ్ చేయనున్నారు. మొత్తనికి ‘అడిగా అడిగా’ అంటూ గోపీ సుందర్ అందించిన మెలోడీలు మళ్ళీ థియేటర్లలో మారుమోగనున్నాయి. నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టిల మధ్య సాగే ఎమోషనల్ జర్నీని బిగం స్ర్కీన్ పై మరోసారి ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో, నాని క్లాసిక్ సినిమాల్లో ఒకటైన ‘నిన్ను కోరి’ మంచి వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.