Reading Time: 2 minutes
Ishan Kishan Abhishek Sharma Teach Travis Head Srh Players Dance Video Goes Viral

SRH Players Dance Video Goes Viral: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మైదానంలో మాత్రమే కాదు, మైదానం బయట కూడా అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా కెప్టెన్ ఇషాన్ కిషన్, ఓపెనర్ అభిషేక్ శర్మ డాన్స్ మాస్టర్‌ లుగా మారి తమ సహచర ఆటగాడు ట్రావిస్ హెడ్‌కు స్టెప్స్ నేర్పుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోలో ట్రావిస్ హెడ్ కెమెరా ముందు నిలబడి షూట్‌లో పాల్గొంటుండగా.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ కెమెరా వెనుక నుంచి డాన్స్ స్టెప్స్ చూపిస్తూ కనిపిస్తున్నారు. వారు చెప్పిన స్టెప్స్‌ ను ట్రావిస్ హెడ్ క్రమంగా ఫాలో అవుతూ డాన్స్ చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు అభిషేక్ శర్మ తన మొబైల్‌ లో ఈ సరదా క్షణాలను రికార్డ్ చేయడం కూడా హైలైట్‌గా మారింది.

ఈ ఫన్నీ వీడియోను చూసిన నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తూ ఆనందిస్తున్నారు. ఈ వీడియోతో ఆటగాళ్ల మధ్య ఉన్న ఫ్రెండ్లీ బాండింగ్, సరదా వాతావరణం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక జట్టు ప్రదర్శన విషయానికి వస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి ఫామ్‌లో కొనసాగుతోంది. చివరిగా ఢిల్లీ కాపిటల్స్ పై గెలిచి వరుసగా మూడు విజయాలు సాధించింది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లలో 4 విజయాలు, 3 ఓటములతో +0.82 నెట్ రన్‌రేట్‌తో 8 పాయింట్లు సాధించి పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ అద్భుతంగా రాణిస్తూ టోర్నీలో టాప్ రన్ స్కోరర్స్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ రేస్ లో పోటీ పడుతున్నారు.