ఆధార్ అనేది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. దీంతో ఇది దుర్వినియోగం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇటీవల ఈ కార్డు ద్వారా జరిగే అక్రమాలు పెరిగిపోతున్నాయి. అక్రమార్కులు వేలిముద్రలు సేకరించి క్లోనింగ్ ప్రక్రియ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. ఇక మీ పర్సనల్ డీటైల్స్ లీక్ అయితే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కాజేసే అవకాశం కూడా ఉంటుంది. దీంతో ఆధార్‌ను భద్రంగా ఉంచుకోవాలి.
యూఐడీఏఐ హెల్ప్ లైన్ నెంబర్, మెయిల్ ద్వారా మీరు ఫిర్యాదు చేయవచ్చు. దీంతో యూఐడీఏఐ అధికారులు స్పందించి మీ ఆధార్ దుర్వినియోగం కాకుండా చర్యలు చేపడతారు. ఈ మూడు విధానాల ద్వారా మీ ఆధార్‌ను వేరువారు ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇది మీ ఆధార్ ఎప్పుడూ సేఫ్‌గా ఉంటుంది.
ఇక హోటల్స్, ఇతర ప్రదేశాల్లో ఆధార్ కార్డు అవసరం ఉన్నచోట మస్క్డ్ ఆధార్ ఉపయోగించండి. మస్క్డ్ ఆధార్‌లో మొదటి 8 నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి. దీని వల్ల మీ ఆధార్ దుర్వినియోగం కాస్త తగ్గుతుంది. ఎక్కడైనా వెరిఫికేషన్ కోసం ఆధార్ అడిగినప్పుడు మస్క్డ్ ఆధార్ అందించండి. దీని వల్ల మీ ఆధార్ వివరాలు భద్రంగా ఉంటాయని చెప్పవచ్చు.
ఇక ఆధార్ యాప్ లేదా యూఐడీఏఐ వెబ్సైట్లోకి వెళ్లి ఎప్పటికప్పుడు మీ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ తెలుసుకోండి. గత ఆరు నెలల హిస్టరీని మీరు చూసుకోవచ్చు. దీంతో మీ ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారు..? ఎందుకు ఉపయోగించారు..? అనే వివరాలు దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఎవరైనా మీకు తెలియకుండా ఆధార్ ఉపయోగించే గుర్తు పట్టవచ్చు. మీకు తెలియకుండా మీ ఆధార్ ఎక్కడైనా ఉపయోగించినట్లు గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయండి.
మీ ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే మీరు బయెమెట్రిక్స్ను లాక్ చేసుకోవాలి. యూఐడీఏఐ వెబ్సైట్ ద్వారా యాప్ ఉపయోగించి మీరు సులువుగా ఆధార్ బయోమెట్రిక్స్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు. మీకు అవసరం లేనప్పుడు లాక్ చేసుకోవాలి. అసవరం ఉన్నప్పుడు అన్ లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. లాక్ చేయడం వల్ల మీ బయోమెట్రిక్స్ అక్రమార్కులు ఉపయోగించలేరు.




