Reading Time: < 1 minute
నేషనల్ లెవల్లో ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ రెమ్యునరేషన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌లో ఉన్న విషయం. అల్లు అర్జున్‌కు ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ అనేది ఉండదట. అసలు నిర్మాతలతో ఆయన డబ్బుల సంగతే మాట్లాడరని ప్రచారం జరుగుతోంది. తాను నిర్మాత గారి అబ్బాయిని కాబట్టి నిర్మాతల కష్టాలు తనకు తెలుసని ఆయన కెరీర్ ఆరంభం నుంచీ చెబుతూ వస్తున్నారు. అందుకే ప్రాఫిట్ షేరింగ్ పద్ధతికే ఓటు వేశారంటున్నారు.ఆయన అనుసరిస్తున్న ఫార్ములా “రూపాయికి 30 పైసలు”. అంటే సినిమా 1000 కోట్లు వసూలు చేస్తే, 300 కోట్లు అల్లు అర్జున్ ఖాతాలోకి వస్తాయి. ఒకవేళ 500 కోట్లు చేస్తే, 150 కోట్లతో తృప్తి పడతారట. ఈ పద్ధతి వల్ల నిర్మాతలకు సగం భారం తగ్గిపోతుందని మేకర్స్ చెబుతున్నారు. అల్లు అర్జున్ బాటలో ఇంకెంతమంది నడుస్తారో చూడాలని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్‌.. రీజనేంటి?

పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?

పాన్ ఇండియా హిట్‌ వరమా..శాపమా?

ఊరిస్తున్న ఒక్క పాట.. పెద్ది టీమ్ ప్లానేంటి?

సమ్మర్‌ హీట్‌.. లైట్‌ అంటున్న స్టార్స్‌