Reading Time: < 1 minute

తిరుపతి ఫ్యామిలీ డెత్ మిస్టరీ వీడింది… రమ్మీ వ్యసనానికి ఐదుగురి బలి… పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..

Caption of Image.

ఇటీవల సంచలనం రేపిన తిరుపతి ఫ్యామిలీ మృతి కేసులో మిస్టరీ వీడింది. రమ్మీ వ్యసనం కారణంగా ఐదుగురు బలయ్యారని తెలిపారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆన్లైన్ రమ్మీకి బానిసైన మోహన్ అప్పుల ఊబిలో చిక్కుకుపోయి… ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపారు పోలీసులు. 

నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంకు చెందిన మోహన్ బుధవారం ( ఏప్రిల్ 22 )తన తల్లి చంద్రకళ, భార్య హరితలను ఇంట్లోనే హత్య చేశాడని.. అనంతరం స్కూల్ కి వెళ్లి తన ఇద్దరు పిల్లలను రైలు పట్టాల దగ్గరికి తీసుకెళ్లి వేగంగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని.. తండ్రి కాపాడే ప్రయత్నంలో పిల్లలు ఇద్దరు రైలును ఢీకొని మృతి చెందినట్లు తెలిపారు పోలీసులు.

ఆన్ లైన్ రమ్మీ వ్యసనంతో అప్పుల ఊబిలోకి..

గత కొంతకాలంగా ఆన్ లైన్ రమ్మీకి బానిసైన మోహన్ రూ. 40 లక్షల వరకు అప్పులు చేసినట్లు తేలిందని తెలిపారు పోలీసులు. ఆస్తులు, బంగారం అమ్మినా అప్పులు తీరలేదని.. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలయ్యేవని తెలిపారు పోలీసులు. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆయన మరణాంతరం వచ్చిన ఉద్యోగాన్ని కూడా మోహన్ వదిలేశాడని.. అతని బ్యూటీపార్లర్ నడుపుతూ, టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేదని తెలిపారు.

►ALSO READ | డ్రైవర్ హత్య కేసులో.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..

మోహన్ భార్య ఇటీవల చీటి డబ్బులతో ఒక సిమెంట్ షాపు కూడా పెట్టించినప్పటికీ… మోహన్ రమ్మీ వ్యసనాన్ని వీడలేక కుటుంబం మొత్తాన్ని బలితీసుకున్నాడని తెలిపారు పోలీసులు. ఐదు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

©️ VIL Media Pvt Ltd.