Reading Time: 2 minutes
SSC CHTE 2026 Jobs: ఎస్‌ఎస్‌సీ- కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.1,12,400 జీతం

దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి ‘కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026’ నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దాదాపు 84 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు మే 14వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్‌ఎస్‌సీ- కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

విభాగాల వారీగా పోస్టుల వివరాలు..

  • జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్ (JTO)
  • జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌ (JHT)
  • జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ (JT)
  • సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌ (SHT)
  • సీనియర్ ట్రాన్స్‌లేటర్‌ ఆఫీసర్ (STO)

ఎస్సెస్సీ కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు హిందీ/ ఇంగ్లిష్ స్పెషలైజేషన్‌లో మాస్టర్ డిగ్రీ లేదా డిగ్రీ స్థాయిలో హిందీ/ ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు హిందీ/ ఇంగ్లిష్‌లో ట్రాన్స్‌లేషన్‌ డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ట్రాన్స్‌లేటర్‌గా అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 14, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఎస్‌ఎస్‌సీ- కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఆన్‌లైన్‌ రాత పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్‌లో జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లిష్ సబ్జెక్టులకు 100 ప్రశ్నలకు 100 మార్కులు చొప్పున నిర్వహిస్తారు. పేపర్ 2 డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో ట్రాన్స్‌లేషన్‌, ఎస్సేకు మొత్తం 200 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్/ సీనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు. అలాగే ఇతర అలవెన్స్‌లు కూడా చెల్లిస్తారు.

ముఖ్య తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 23, 2026.
  • ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: మే 14, 2026.
  • దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: మే 15, 2026.
  • దరఖాస్తు సవరణ తేదీలు: మే 19, 2026 నుంచి మే 20, 2026 వరకు.
  • పేపర్ 1 రాత పరీక్ష తేదీ: ఆగస్టు- సెప్టెంబరు 2026 మధ్యలో ఉంటుంది.

ఎస్‌ఎస్‌సీ- కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.