Reading Time: < 1 minute
Trisha Krishnan Social Media Post Vijay Tvk Party Hint Ghilli Song Tamil Nadu Elections

రాజకీయాల్లో ఎక్కువగా సినీ వ్యక్తుల ప్రభావం ఉండే తమిళ రాజకీయాలు, ఈసారి ఎక్కువగా విజయ్‌తో పాటు త్రిష చుట్టూ తిరిగాయి. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు వెళ్లడం, విజయ్‌తో కలిసి ఒకసారి పబ్లిక్ గానే త్రిష కనిపించడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతూనే ఉంది. అయితే, ఈ విషయం మీద అటు విజయ్ కానీ, ఇటు త్రిష గానీ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ, ఈరోజు తమిళనాడు ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం త్రిష తన సోషల్ మీడియా వేదికగా చేతికి సిరా గుర్తుతో ఉన్న ఫోటోను షేర్ చేసింది.

Also Read :Varanasi: అంటార్కిటికాలో బాబు వేట!

ఆ ఫోటోకి త్రిష పెట్టిన సాంగ్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. నిజానికి విజయ్‌తో కలిసి త్రిష ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే, వీరిద్దరూ కలిసి చేసిన ‘గిల్లి’ (తెలుగు ‘ఒక్కడు’ రీమేక్) సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ “అర్జునర్ విల్లు” ఆడియోతో ఈ పిక్ పోస్ట్ చేసింది త్రిష. ఇక్కడ త్రిష రెండు హింట్స్ ఇస్తోందని విజయ్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఒకటి ‘గిల్లి’ సినిమాలోని సాంగ్ కాగా, మరొకటి విజయ్ పార్టీ గుర్తు అయిన ‘విజిల్’ వచ్చేలా ఆ సాంగ్ ఉండడం. ఈ క్రమంలో ఇప్పటివరకు స్పందించని త్రిష, ఇప్పుడు ఇన్ డైరెక్ట్ గా విజయ్‌కి ఓటు వేయమని తన అభిమానులకి హింట్ ఇచ్చేలా ఈ పోస్ట్ పెట్టిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.