
Iran Mocks Trump: వరస యూ-టర్న్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన క్రెడిబిలిటీ కోల్పోతున్నారు. ఇరాన్ యుద్ధం విషయంలో బాంబులు కురిపిస్తానని సాయంత్రం కామెంట్స్ చేస్తే, తెల్లారేసరికి సీజ్ ఫైర్ పొడగింపు అంటూ మరో విరుద్ధమైన ప్రకటన చేస్తున్నారు. ట్రంప్ తీరుపై ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఇరాన్ సైటైర్లు పేలుస్తోంది.
తాజాగా, హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ ట్రంప్‌ను వెక్కిరిస్తూ ఏఐ వీడియోతో ఒక పోస్ట్ పెట్టింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ సమావేశాలకు ఇరాన్ వెళ్లకపోవడంతో ట్రంప్ ఇలా ప్రవర్తించి ఉంటారని ఎద్దేవా చేసింది. ట్రంప్ చర్చలకు సిద్ధమైనప్పటికీ, ఇరాన్ అధికారులు ఇస్లామాబాద్ వెళ్లలేదు. దీనిపై ఒక ఏఐ వీడియోలో.. ట్రంప్ ఆగ్రహంతో డీల్ కుదరకుంటే ఇరాన్‌పై బాంబులు వేస్తానని ముందుగా చెబుతాడు. ఆ తర్వాత కూడా ఇరాన్ ప్రతినిధులు సమావేశానికి వెళ్లరు.
Read Also: Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
కొద్దిసేపటికే, ఖాళీగా ఉన్న కుర్చీలను చూస్తూ.. ఇరానీయులు ఎక్కడున్నారు? అని ప్రశ్నిస్తారు. కొంత సమయానికి ట్రంప్ సహాయకుడు ఒక చీటిని అందిస్తాడు. అందులో ‘‘ట్రంప్ నోరుమూయి’’ అని రాసి ఉంటుంది. దీని తర్వాత ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను పొడగిస్తున్నాను’’ అని ట్రంప్ చెప్పి బయటకు వెళ్లిపోతారు.
ఇస్లామాబాద్ లో జరగాల్సిన రెండో దశ యూఎస్-ఇరాన్ చర్చలకు ఇరాన్ అధికారులు హాజరుకాలేదు. పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతోందని ఇరాన్ ఆరోపిస్తోంది. తమ ప్రతిపాదనల్ని పాకిస్తాన్ పక్కన పెట్టేసి, అమెరికా ప్రతిపాదనల్ని ముందుతు తీసుకువస్తోందని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు, కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, అమెరికా ఉల్లంఘిస్తోందని మండిపడింది.
How was the ceasefire extended?
The video is getting viral in Iran. pic.twitter.com/UCldpWjZMO— Iran In Hyderabad (@IraninHyderabad) April 22, 2026