Reading Time: 2 minutes

విజయ్ దేవరకొండ – శ్రీలీల మధ్య అదిరిపోయే కెమిస్ట్రీ.. వెండితెరపైకి ఈ క్రేజీ కాంబో రాబోతోందా?

Caption of Image.

టాలీవుడ్ లో కొత్త కాంబినేషన్లు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తాయి. ప్రస్తుతం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు రౌడీస్టార్ విజయ్ దేవరకొండ, టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. ఈ జంటనే ఒకే ప్రేమ్ లో చూడాలని అభిమానులు ఎంతో కాలంగా కోరుకుంటున్నారు . ఫ్యాన్స్ కల ఇప్పుడు నిజమైంది. అయితే అది వెండితెరపై కాదు.  వీరిద్దరూ కలిసి ఒక పాపులర్ కాఫీ బ్రాండ్ కమర్షియల్ యాడ్ లో నటించారు.  ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతుండటంతో, ఈ క్రేజీ కాంబోపై ఇండస్ట్రీలో సరికొత్త చర్చ మొదలైంది.

ఒకే ఫ్రేమ్‌లో ఎనర్జీ ప్యాక్డ్ జోడీ..

ఈ కాఫీ యాడ్‌లో విజయ్, శ్రీలీల మధ్య ఉన్న ఈజ్  , ఫ్రెష్ లుక్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. వీరిద్దరూ వెండితెరపై ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా సినిమాల్లో జంటల మధ్య కెమిస్ట్రీ కుదిరితేనే ఆ సినిమా సగం విజయం సాధించినట్లు లెక్క. ఈ జంట విషయంలో కేవలం ఒక చిన్న యాడ్ ఫిల్మ్‌తోనే ఆ మ్యాజిక్ ప్రూవ్ అయిపోయింది.

బిగ్ స్క్రీన్ పై క్రేజీ చర్చలు..

ఈ యాడ్ సృష్టించిన ఇంపాక్ట్ చూస్తుంటే, త్వరలోనే వీరిద్దరి కాంబోలో ఒక సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ ఇప్పటివరకు రీతూ వర్మ, రష్మిక మందన్న, సమంత వంటి స్టార్స్‌తోనే కాకుండా ఇటీవల భాగ్యశ్రీ బోర్సే వంటి  హీరోయిన్లతోనూ జోడీ కట్టారు. మరోవైపు శ్రీలీల సైతం మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ నుండి నితిన్, రామ్ పోతినేని వంటి యంగ్ హీరోల వరకు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది.

►ALSO READ | Allu Arjun AA23: అల్లు అర్జున్-లోకేష్ మూవీ నెక్స్ట్ లెవల్ అప్డేట్.. AA23 కథపై రైటర్ బిగ్ స్టేట్‌మెంట్

యూత్ అప్పీల్.. నెక్స్ట్ లెవెల్..

విజయ్ దేవరకొండకు ఉన్న మాస్ అండ్ క్లాస్ ఇమేజ్, శ్రీలీలకు ఉన్న అద్భుతమైన డ్యాన్స్ అండ్ గ్లామర్ పవర్ కలిస్తే అది నెక్స్ట్ లెవెల్ రికార్డులకు దారితీస్తుంది. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే అది టాలీవుడ్ యొక్క అత్యంత ఉత్సాహభరితమైన , ఫ్రెష్ కాంబినేషన్ అవుతుందనడంలో సందేహం లేదంటున్నారు సినీ వర్గాలు. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, అలాగే శ్రీలీల చేతిలోనూ క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఈ లోపు ఏ దర్శకుడైనా వీరిద్దరి మధ్య ఉన్న ఈ మ్యాజికల్ కెమిస్ట్రీని వెండితెరపైకి తెస్తే అది ఖచ్చితంగా టాలీవుడ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్రెష్ కాంబినేషన్ అవుతుంది.

ప్రస్తుతం అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినప్పటికీ, ఈ కాఫీ యాడ్ ద్వారా మొదలైన చర్చలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి. ఏ దర్శకుడు ఈ ‘బ్యూటిఫుల్ పెయిర్’ను వెండితెరకు పరిచయం చేస్తారో అని యూత్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.