భారతీయ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి పెట్టే పేరు అక్కడి వాతావరణం, శక్తి, మనసులపై ప్రభావం చూపుతుందని నమ్మకం ఉంది. ఇటుకలు, రాళ్లు కేవలం ఒక కట్టడాన్ని మాత్రమే నిర్మిస్తాయి. కానీ ఆ కట్టడాన్ని నిజమైన “ఇల్లుగా” మార్చేది అందులో నివసించే మనుషులు, వారి భావోద్వేగాలు, కలలు. అందుకే ప్రతి ఒక్కరూ తమ కలల ఇంటిని ప్రత్యేకంగా, ఆత్మీయంగా తీర్చిదిద్దాలని కోరుకుంటారు. ఇలాంటి సందర్భంలో ఇంటికి పెట్టే పేరు కూడా చాలా ముఖ్యమవుతుంది. ఒక చిన్నారి పేరు అతని వ్యక్తిత్వాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో.. అలాగే ఇంటి పేరు ఆ ఇంటి ఆరా (energy), వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ రోజుల్లో చాలా మంది తమ ఇంటికి ప్రత్యేకమైన, అర్థవంతమైన పేర్లు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
మీరు కూడా మీ ఇంటికి మంచి పేరు కోసం వెతుకుతున్నట్లయితే.. వాస్తు శాస్త్రం ప్రకారం శుభప్రదంగా భావించే కొన్ని సంస్కృత పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిర్వాణం.. ఈ పేరు ప్రశాంతత, ఆనందం, విముక్తిని సూచిస్తుంది. ఇంట్లో నిశ్శబ్దం, ఆత్మశాంతి ఉండాలని కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక.
2. అమృతాలయ… సంతోషం, మాధుర్యం, సంతృప్తితో నిండిన గృహం అనే అర్థం. ప్రేమతో నిండిన కుటుంబ వాతావరణానికి అనుకూలం.
3. స్నేహసదనం.. స్నేహం, ఆప్యాయతకు ప్రతీక. కుటుంబ సభ్యుల మధ్య బంధాలను బలపరచే భావనను ఇస్తుంది.
4. అమరేశం.. బలం, రక్షణను సూచించే పేరు. భద్రత, స్థిరత్వం కోరుకునే వారికి ఇది సరైనది.
5. సౌరభం.. సువాసన, తాజాదనాన్ని సూచిస్తుంది. ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూలత, తాజా వాతావరణం ఉండాలని సూచించే పేరు.
6. సత్యలోకం.. నిజాయితీ, ధర్మానికి ప్రతీక. సత్యమార్గంలో నడిచే కుటుంబానికి అనువైన పేరు.
7. మంగళాలయం.. శుభం, అదృష్టానికి సంకేతం. కొత్తగా నిర్మించిన ఇంటికి ఈ పేరు ప్రత్యేకంగా శుభప్రదంగా భావిస్తారు.
8. సుకృతం.. మంచి పనులు, పవిత్రతను సూచిస్తుంది. మంచి ఆలోచనలు, సానుకూల శక్తి కోసం ఈ పేరు బాగుంటుంది.
9. శాంతివనం
ప్రశాంతత, ప్రకృతితో సమీపాన్ని సూచించే పేరు. నిశ్శబ్ద జీవనశైలిని ఇష్టపడే వారికి అనువైనది.
10. అన్నపూర్ణ
సంపద, సమృద్ధికి సంకేతం. ఈ పేరు ఉన్న ఇంట్లో అన్నపూర్ణ కటాక్షం ఉండి ఎప్పుడూ తృప్తి, ఐశ్వర్యం ఉంటాయని నమ్మకం.
మీ ఇంటి పేరు కేవలం ఒక గుర్తింపే కాదు.. అది మీ జీవనశైలి, విలువలు, ఆశయాల ప్రతిబింబం. కాబట్టి మీ మనసుకు నచ్చిన, మీ కుటుంబానికి సరిపోయే పేరును ఎంపిక చేసుకుని, మీ కలల ఇంటిని మరింత ప్రత్యేకంగా మార్చుకోండి.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)





