Reading Time: < 1 minute

అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి రాహుల్ గాంధీకి వివరించా: పీసీసీ చీఫ్

Caption of Image.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి రాహుల్ గాంధీకి వివరించినట్లు చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 2026 ఏప్రిల్ 23న ఢిల్లీలోని 10 జన్ పథ్ లో రాహుల్ గాంధీతో సమావేశం అయిన మహేష్​ కుమార్ గౌడ్..  రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై  చర్చించారు. రాష్ట్రంలో కుల గణన జరిపి సమగ్ర అధికారిక సమాచారాన్ని ప్రకటించినట్లు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కి వివరించారు.

దాదాపు15 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి రాహుల్ గాంధీకి టీపీసీసీ వివరించారు. రాష్ట్రంలో పార్టీ పరంగా జరుగుతున్న ఆర్గనైజేషన్ కార్యక్రమాలను స్పష్టంగా వివరించారు. డీసీసీ అధ్యక్షుల  నియామకాలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, బీఎల్ఏల నియామకాలు, అనుబంధ సంఘాల నియామకాలు తదితర అంశాలపై సమావేశంలో రాహుల్ గాంధీకి వివరించారు.

►ALSO READ | ఆ భయంతోనే ఎక్కడెక్కడోళ్లో వచ్చి ఓటేశారు !

 ఏఐసీసీ జాతీయ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించేలా చూడాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరారు టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్. అదే విధంగా మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని జోడించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తులపై రాహుల్ సానుకూలంగా స్పందించినట్లు మహేష్​ కుమార్ గౌడ్ తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.