Reading Time: < 1 minute

‘ఆదర్శ కుటుంబం’లోకి తమన్ ఎంట్రీ.. త్రివిక్రమ్-వెంకీ మూవీలో అనూహ్య మార్పు!

Caption of Image.

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ (House No. 47 – AK47). ఈ కలయిక కోసం టాలీవుడ్ ప్రేక్షకులు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే టెస్ట్ గా వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మ్యూజిక్ డైరెక్టర్ మార్పు?

ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. అయితే, లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని కారణాలతో ఆయన వైదొలగగా, ఆ స్థానంలోకి త్రివిక్రమ్ ఆస్థాన సంగీత దర్శకుడు ఎస్. తమన్ ఎంట్రీ ఇచ్చినట్లు ఫిలిం నగర్ టాక్ వినిపిస్తోంది.

త్రివిక్రమ్ – తమన్ కాంబో అంటేనే మ్యూజికల్ చార్ట్‌బస్టర్స్ గ్యారెంటీ. ‘అల వైకుంఠపురములో’, ‘అరవింద సమేత’ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత వీరిద్దరూ మరోసారి వెంకీ మామ సినిమా కోసం జట్టుకట్టడం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలోనూ తమన్ ఇలాగే చివరి నిమిషంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.

►ALSO READ | పెళ్లి చేసుకున్నా ‘సిట్యుయేషన్‌షిప్’లోనే ఉన్నాం.. రకుల్-జాకీ షాకింగ్ కామెంట్స్!

ఎమోషనల్ డ్రామాగా..

ఈ మూవీ ఇదొక కుటుంబ భావోద్వేగాలతో కూడిన క్రైమ్ డ్రామా అని తెలుస్తోంది. చాలా కాలం తర్వాత నారా రోహిత్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మే నాటికి షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించి, అక్టోబర్ 2న (గాంధీ జయంతి) ఈ చిత్రాన్ని విడుదల చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలకు మాటలు అందించిన త్రివిక్రమ్, ఇప్పుడు వెంకటేశ్‌ను డైరెక్ట్ చేస్తుండటంతో థియేటర్లలో నవ్వుల విందు గ్యారెంటీ అని అభిమానులు ఆశిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.