Reading Time: < 1 minute
Nbk111 This Time Thamans Music Anantha Srirams Lyrics Something Going To Special

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో 111వ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి మాస్ జాతర చేయడానికి సిద్ధమవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అఖండ మొదలుకొని అఖండ 2 వరకు.. బాలయ్య అంటే బాక్సులు బద్దలయ్యే మ్యూజిక్ ఇస్తున్న తమన్.. మరోసారి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే రెండు పవర్‌ఫుల్ ట్యూన్స్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్స్ మాస్ ఆడియన్స్‌ను ఊగిస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఓ పవర్‌ఫుల్ సాంగ్ కోసం ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించినట్టుగా తెలిసింది. బాలయ్య ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన రాసిన లిరిక్స్, తమన్ మ్యూజిక్‌కు థియేటర్లు షేక్ అవడం గ్యారెంటీ అని అంటున్నారు. త్వరలోనే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ పాట చిత్రీకరణ ప్రారంభం కానుందట. ఇందుకోసం చిత్ర బృందం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం. పాటతో పాటు అదే లొకేషన్‌లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారట. బాలకృష్ణ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈసారి కూడా బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్‌ ఎన్బీకె 111లో మామూలుగా ఉండదని అంటున్నారు. మరి గోపిచంద్ మలినేని ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.