Reading Time: < 1 minute
Iran Supreme Leader Khamenei Funeral Delay Security Fears

Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ ఇజ్రాయిల్, అమెరికా దాడుల్లో మరణించాడు. ఇతను మరణించి నెల రోజుల పూర్తయినా, అంత్యక్రియల విషయంపై ఇంకా స్పష్టత లేదు. భద్రతా కారణాలు చూపుతూ ఇరాన్ అధికారులు వాయిదా వేస్తున్నట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. భారీ బహిరంగ అంత్యక్రియలు నిర్వహించడంలో ప్రమాదాలు, ముఖ్యంగా ఇజ్రాయిల్ దాడి చేసే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also: Indian tanker: అనుమతి ఇచ్చి, కాల్పులు జరపడమేంటి..? భారత్ నౌకపై ఇరాన్ కాల్పులు..

ప్రస్తుత పరిస్థితుల్లో అంత్యక్రియలు నిర్వహించడానికి ఇరాన్ భయపడుతోంది. ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్‌ ప్రకారం.. ప్రస్తుత పరిస్థితుల్లో అంత్యక్రియలు నిర్వహించడానికి ఇరాన్ భయపడుతోందని, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేంత బలంగా, ధైర్యంగా లేదని వ్యాఖ్యానించింది.

ఫిబ్రవరి 28లో అమెరికా-ఇజ్రాయిల్ దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీ మరణించారు. ఆయన మరణం తర్వాత ఖమేనీ స్వస్థలం మషద్‌లో అంత్యక్రియలు జరుగుతాయని పలు నివేదికలు వెలువడ్డాయి. మార్చి 4న మూడు రోజుల పాటు అంత్యక్రియలు ప్లాన్ చేశారు. కానీ అమెరికా, ఇజ్రాయిల్ దాడుల భయంతో ఈ ప్లాన్ రద్దు చేశారు. ప్రస్తుతం, ఏప్రిల్ 8న తాత్కాలికంగా కుదిరిన కాల్పుల విరమణ ముగింపు దగ్గరపడుతున్నా వేళ మరోసారి ఖమేనీ అంత్యక్రియలు వార్తల్లో నిలిచాయి.