Reading Time: 2 minutes
ఇదేక్కడి సంప్రదాయం..? శవయాత్రలో డీజే డ్యాన్స్! వికృత చేష్టాలంటూ నెట్టింట దుమారం..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక అంతిమ యాత్ర వీడియో నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా విషాదంగా సాగాల్సిన శవయాత్రలో డీజే (DJ) పాటలు, డ్యాన్స్‌లు కనిపించడం ఈ చర్చకు ప్రధాన కారణం. వీడియోలో ఒక వ్యక్తి అంతిమ యాత్ర వేడుకలా సాగడం కనిపిస్తోంది. అది ఒక వృద్ధుని అంతిమ యాత్రగా తెలిసింది. పూలతో అలంకరించిన వాహనం వెనుక పెద్ద డీజే ట్రక్కు ఉంది. అందులో నుండి వస్తున్న హై-వాల్యూమ్ మ్యూజిక్‌కు యువకులు, బంధువులు రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ, డబ్బులు చల్లుతూ కనిపిస్తున్నారు. ఈ దృశ్యం చూసి స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఆ వ్యక్తి తన జీవితాన్ని పూర్తి స్థాయిలో గడిపారు. అందుకే ఆయన మరణాన్ని దుఃఖంతో కాకుండా సంతోషంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది ఒక రకమైన సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతిమ సంస్కారాలకు ఒక పద్ధతి ఉంటుంది. డీజేలు పెట్టి డ్యాన్స్ చేయడం మరణించిన వ్యక్తిని అవమానించడమే. ఇలాంటి పోకడలు మన సంస్కృతిని నాశనం చేస్తున్నాయి అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

గతంలో మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో ఒక వ్యక్తి తన స్నేహితుని చివరి కోరిక మేరకు అతని శవయాత్రలో డ్యాన్స్ చేసిన ఘటన అందరినీ కదిలించింది. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో మాత్రం సరైన కారణం తెలియకపోవడంతో ప్రజలు దీనిని ఒక వింతైన ఘటనగా చూస్తున్నారు. కాలం మారుతున్నా కొద్దీ మనుషుల ఆలోచనా విధానం కూడా మారుతోంది. అయితే, సంప్రదాయాలకు భంగం కలగకుండా ఇలాంటి మార్పులను ఆహ్వానించాలా వద్దా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..