Reading Time: 2 minutes
Music Director Thaman Name Story Father Ghantasala Siva Kumar Legacy

S.S.Thaman: తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఎస్.ఎస్.తమన్, తన పేరు, తన కుటుంబ నేపథ్యం గురించి గతంలో ఎప్పుడూ చెప్పని విషయాలను తాజాగా ఎన్టీవీ (NTV) కి ఇచ్చిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా తన పేరు మార్పు వెనుక ఉన్న కారణం, తన తండ్రి ఘంటసాల శివకుమార్ పేరును నిలబెట్టడంలో తాను పడిన సంఘర్షణను ఆయన గుర్తుచేసుకున్నారు.

READ ALSO: Golmal 5 : బాలీవుడ్ కామెడీ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ గోల్మాల్ 5లో విలన్ గా స్టార్ హీరో

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని, ఏ మతానికి సంబంధం లేని పేరు కావాలని కోరుకున్నట్లు తెలిపారు. “నా పేరులో ఎలాంటి మతపరమైన ఛాయలు ఉండకూడదని నేను భావించాను. అందుకే అప్పట్లో ‘Google’ లాగా వినడానికి కొత్తగా, వెరైటీగా ఉండే పేరు కోసం వెతికాను. అలా పుట్టిందే ‘తమన్’ అనే పేరు,” అని ఆయన వివరించారు.

థమన్ తండ్రి ఘంటసాల శివకుమార్ కూడా ప్రముఖ సంగీత విద్వాంసులే. అయితే, ఆ పేరును మోయడం తనకు తొలినాళ్లలో చాలా కష్టంగా అనిపించిందని తమన్ ఎమోషనల్ అయ్యారు. “మా నాన్నగారి పేరు (Legacy) మోయడం నాకు చాలా భారంగా అనిపించేది. చాలా చిన్న వయసులోనే ఆయనను కోల్పోయాను. ఆయన పేరుకు ఎక్కడా మచ్చ రాకూడదని, నాన్నగారి గౌరవాన్ని నిలబెట్టాలని నేను నిరంతరం శ్రమించాను” అని చెప్పారు. తన తండ్రి తన కోసం కొనిచ్చిన తొలి మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ (డ్రమ్ ప్యాడ్) తన జీవితంలో ఎంతో విలువైనదని, అది కొనేందుకు తన తల్లి తన దగ్గరున్న బంగారాన్ని కూడా ఇచ్చేందుకు సిద్ధపడిందని, కానీ ఆ సెంటిమెంట్‌ను తాము ఎలా దాటుకుని వచ్చామో గుర్తుచేసుకున్నారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినప్పటికీ, ఆ పరిస్థితులే తనలో పరిణతిని నింపాయని తమన్ అన్నారు. తన కెరీర్‌లో తీసుకున్న ప్రతి నిర్ణయం చాలా స్వతంత్రంగా తీసుకున్నానని, తన తండ్రి మార్క్ అయిన ‘మంచి మనిషి’ అనే పేరును కాపాడుకోవడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. నేడు ‘తమన్’ అనే పేరు ఇండియాలో ఒక బ్రాండ్‌గా మారిందంటే, దాని వెనుక తన తండ్రి ఆశీస్సులు, తన శ్రమ ఉన్నాయని అన్నారు.

READ ALSO: Indian Rupee: ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి.. తొలిసారిగా 93 మార్కును దాటిన డాలర్!