July 11, 2026

Dhurandhar TheRevenge : ధురంధర్ 2 మొదటి రోజు కలెక్షన్స్.. బాహుబలి, పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్?

Dhurandhar TheRevenge : ధురంధర్ 2 మొదటి రోజు కలెక్షన్స్.. బాహుబలి, పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్?
Reading Time: < 1 minute
Dhurandhar 2 Advance Booking Ranveer Singh Starrer Eyes %e2%82%b9250 Crore Opening Day

ధురంధర్ 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ర‌ణ్‌వీర్ సింగ్‌ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్..  మరికొన్ని గంటల్లో భారీ ఎత్తున థియేటర్లోకి రాబోతోంది. ఇక ఈ ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం అదిరిపోయాయనే చెప్పాలి. ప్రీమియర్స్ ద్వారానే రూ.  58.64  కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్టుగా తెలుస్తుంది.  ఇక జనరల్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి. మొత్తంగా.. ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2 మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.120 కోట్ల వచ్చినట్టుగా చెబుతున్నారు.

Also Read : PEDDI : తమిళ్, కన్నడలో పెద్దికి పోటీ తప్పదా..?

మూవీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉండటంతో అడ్వాన్స్ కలెక్షన్లు రూ. 150 కోట్లు దాటే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు రోజులకు దాదాపు 10 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇండియాలో ఫస్ట్ వీకెండ్‌లో మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.197.87 కోట్లు వచ్చినట్టుగా చెబుతున్నారు. అటు ఓవర్సీస్ లోనూ ధురంధర్ 2 దుమ్ముదులిపేస్తోంది. నార్త్ అమెరికా ప్రీ సేల్స్‌లో 34.37  మిలియన్ డాలర్ల మార్కును దాటి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో.. ఈ సినిమా డే 1 కలెక్షన్స్ ఎంత అనే చర్చ జరుగుతోంది. ఈజీగా వరల్డ్ వైడ్‌గా రూ. 250 కోట్ల ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు రూ. 200 కోట్ల ఓపెనింగ్స్ ఉన్న సినిమాలు తెలుగు నుంచే ఉన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప 2 మాత్రమే ఫస్ట్ డే 200 కోట్ల క్లబ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ధురంధర్ 2 ఓపెనింగ్స్  రూ. 250 కోట్లు రాబడితే.. హిందీ సినిమా చరిత్రలో ఇదే ఫస్ట్ రికార్డ్‌ కానుంది.