Reading Time: < 1 minute
You Should Also Complete This Work By March 31 Otherwise The Sukanya Samriddhi Account Will Be Closed

తమ ఆడపిల్లల భవిష్యత్తును బంగారుమయం చేయాలని, వారికి ఆర్థికంగా అండగా ఉండాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసమే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సుకన్య సమృద్ధి యోజన’పథకంలో చాలా మంది పెట్టుబడి పెడుతుంటారు. ఈ పథకంలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటంతో పాటు.. దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయి. అయితేజజ ఈ ఖాతా విషయంలో ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. దీనిని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు, కానీ ఇది మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా ఖాతాలో కొంత మొత్తాన్ని జమ చేయాలి. ఒకవేళ ఈ ఆర్థిక సంవత్సరం గడువు లోపు మీరు కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే.. మీ ఖాతా నిలిచిపోయే అయ్యే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే.. మీరు మార్చి 31వ తేదీలోపు మీ ఖాతాలో డబ్బు జమ చేయాలి.

Also Read:Exams: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షలు ఏవో తెలుసా.. మన ఇండియా నుంచి కూడా ఉన్నాయ్…

మార్చి 31లోపు ఎందుకు చేయాలి?
సుకన్య సమృద్ధి యోజన ఖాతాను యాక్టివ్‌గా ఉంచాలంటే.. ప్రతి ఏటా ఒక కనీస మొత్తాన్ని కట్టడం తప్పనిసరి. చాలామంది ఏడాది పొడవునా డబ్బులు కట్టడం మర్చిపోతుంటారు. అలా మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అంటే మార్చి 31 నాటికి ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయడం చాలా ముఖ్యం.

ఒకవేళ మీరు ఆ తేదీలోపు కనీస మొత్తాన్ని జమ చేయకపోతే.. మీ ఖాతా నిలిపివేయబడుతుంది. దానిని తిరిగి యాక్టివేట్ చేయాలంటే మీరు జరిమానా (Penalty) చెల్లించాల్సి రావచ్చు. తద్వారా అనవసరమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి.. మీరు కూడా ఈ పథకంలో ఖాతా కలిగి ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కట్టాల్సిన కనీస మొత్తాన్ని వెంటనే చెల్లించండి. మార్చి 31 వరకు వేచి చూడకుండా.. వీలైనంత త్వరగా పూర్తి చేయడం ఉత్తమం.