July 10, 2026

Sachin Tendulkar: సచిన్ను జట్టు నుంచి తప్పించాలనుకున్నాం.. బీసీసీఐ మాజీ సెలక్టర్ సంచలన వ్యాఖ్యలు

Sachin Tendulkar: సచిన్ను జట్టు నుంచి తప్పించాలనుకున్నాం.. బీసీసీఐ మాజీ సెలక్టర్ సంచలన వ్యాఖ్యలు
Reading Time: 2 minutes

Sachin Tendulkar: సచిన్ను జట్టు నుంచి తప్పించాలనుకున్నాం.. బీసీసీఐ మాజీ సెలక్టర్ సంచలన వ్యాఖ్యలు

Caption of Image.

Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ పై బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ సంచలన విషయాలు తెలియజేశారు. సచిన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి సంవత్సరం ముందే.. అతడ్ని జట్టు నుంచి తప్పించాలని సెలక్షన్ కమిటీ భావించిందన్నారు. ఈ విషయాన్ని నేరుగా సచిన్‌కే చెప్పినప్పుడు అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడని సందీప్ పాటిల్ గుర్తు చేసుకున్నాడు.

24 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన సచిన్, 2013లో రిటైర్మెంట్ ఇచ్చాడు. 2012లో సచిన్ ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డారు. ఆ ఏడాది ఆడిన 9 టెస్టుల్లో కేవలం 23.80 సగటుతో ఒక్క సెంచరీ కూడా లేకపోగా.. వన్డేల్లోనూ అతని సగటు 31.50 మాత్రమేగా ఉంది. ఆ సమయంలో నేను (సందీప్ పాటిల్) సచిన్‌తో మాట్లాడాను.. ‘మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?’ అని ప్రశ్నించాను.. దానికి ఆయన ‘ఎందుకు?’ అన్నారు.. సెలక్షన్ కమిటీ మీ స్థానంలో మరొకరిని తీసుకు రావాలని చూస్తోందని చెప్పాను.. ఆ మాట వినగానే సచిన్ ఆశ్చర్యపోయాడు.. కాసేపటి తర్వాత మళ్లీ ఫోన్ చేసి ‘మీరు చెప్పేది నిజమేనా?’ అని అడగగా.. నేను ‘అవును’ అని చెప్పినట్లు మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పేర్కొన్నారు. 

ALSO READ :  జస్‌ప్రీత్ బుమ్రా సంచలన నిర్ణయం.. టీ20లకి గుడ్ బై?

సెలక్టర్లకు ఒక ప్లేయర్ ని బలవంతంగా రిటైర్మెంట్ చేయించే అధికారం ఉండదని సందీప్ పాటిల్ తేల్చి చెప్పాడు. సెలక్టర్లు కేవలం ఒక ఆటగాడిని జట్టు నుంచి మాత్రమే తప్పించగలరని చెప్పుకొచ్చారు. కానీ, మీ కెరీర్ ముగిసిందని చెప్పలేం.. మేము అతని ప్రణాళికల గురించి మాత్రమే అడిగాం, అతను కొనసాగాలని కోరుకున్నాడు.. మేం ఒకే అన్నామని వెల్లడించారు. చివరకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని సచిన్ స్వయంగా తీసుకుని తనకు చెప్పాడని పాటిల్ తెలిపారు. 

తన హయాంలో జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అజింక్యా రహానే, మహమ్మద్ షమీ లాంటి స్టార్ క్రికెటర్లను జట్టులోకి తీసుకొచ్చామని సందీప్ పాటిల్ వెల్లడించారు. కానీ ప్రజలు ఆ విషయాలను గుర్తుంచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలు ఎందుకు కోపంగా ఉన్నారో నాకు తెలుసు.. మేము కేవలం సచిన్‌ను మేం డ్రాప్ చేశామనే గుర్తుంచుకున్నారు.. బుమ్రా, షమీ లాంటి క్రికెటర్లను తెచ్చింది మర్చిపోయారని పేర్కొన్నారని పాటిల్ చెప్పారు. 
 

©️ VIL Media Pvt Ltd.