టేకు ఆకుల శక్తి ఏంటో తెలుసా?.. ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయంటే!
టేకు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఇళ్లకు వాడే గట్టి కలప మరియు ఖరీదైన ఫర్నిచర్ మాత్రమే. కానీ టేకు కేవలం కలప రారాజు మాత్రమే కాదు, ప్రకృతి మనకు ఇచ్చిన ఒక గొప్ప ఔషధ గని అని మీకు తెలుసా? ఆయుర్వేదంలో టేకు ఆకులు, బెరడు వేర్లకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. చర్మ సమస్యల నుండి గాయాల వరకు ఇది ఎలా సంజీవనిలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫర్నిచరే కాదు.. ఇదొక ఔషధ గని సాధారణంగా టేకు చెట్లను మనం కేవలం వాణిజ్య పంటగానో లేదా అడవుల్లోనో చూస్తుంటాం. ఇళ్లలో కిటికీలు, తలుపులు సోఫాలు, మంచాల తయారీకి దీనిని ఎక్కువగా వాడతాం. అయితే తరతరాలుగా మన్నికకు మారుపేరుగా నిలిచిన ఈ చెట్టు వెనుక ఎన్నో శతాబ్దాల ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.

సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో టేకు చెట్టును ఒక అద్భుతమైన వృక్షంగా భావిస్తారు. గ్రామీణ వైద్యంలో ‘సంజీవని’ఆధునిక కాలంలో చాలా మంది టేకును కేవలం కలప కోసమే అనుకుంటున్నారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ దీనిని అనేక అనారోగ్య సమస్యలకు ఇంటి వైద్యంగా వాడుతున్నారు. టేకు చెట్టు ఆకులు బెరడు గింజలు వేర్లు శతాబ్దాలుగా జానపద వైద్యంలో ఉపయోగపడుతున్నాయి.
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నయం చేసే సహజ సమ్మేళనాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. గాయాలను మానపే అద్భుత శక్తిమనం నిత్య జీవితంలో ఎదుర్కొనే చిన్న చిన్న గాయాలు, గీరుకుపోవడం వంటి సమస్యలకు టేకు ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక ఈ ఆకులలో రక్తాన్ని గడ్డకట్టించే గాయాన్ని త్వరగా మాన్పే ప్రత్యేకమైన యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి. చర్మ సమస్యలు, వాపులు జీర్ణ సమస్యలు జ్వరం వంటి వాటిని తగ్గించడంలో కూడా టేకు భాగాలు ఎంతగానో దోహదపడతాయి.
ఇక ప్రకృతి ప్రసాదించిన వృక్షాలలో టేకు నిజంగానే ఎంతో విలువైంది. కేవలం వాణిజ్య పరంగానే కాకుండా, ఇందులోని సహజసిద్ధమైన ఔషధ గుణాలు మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. మన చుట్టూ ఉన్న ఇలాంటి ప్రకృతి వైద్యంపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం.
గమనిక: టేకు ఆకులను చిన్న చిన్న గాయాలకు ప్రాథమిక చికిత్సగా వాడుకోవచ్చు. అయితే, లోతైన గాయాలు లేదా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు ఉన్నప్పుడు మాత్రం సొంత వైద్యం చేసుకోకుండా తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి
The post టేకు ఆకుల శక్తి ఏంటో తెలుసా?.. ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయంటే! appeared first on Manalokam – Latest Telugu News & Updates.