July 6, 2026

కాళేశ్వరం కట్టింది వాళ్లే.. కూల్చింది వాళ్లే: బీఆర్ఎస్‎పై మంత్రి పొంగులేటి ఫైర్

కాళేశ్వరం కట్టింది వాళ్లే.. కూల్చింది వాళ్లే: బీఆర్ఎస్‎పై మంత్రి పొంగులేటి ఫైర్
Reading Time: < 1 minute

కాళేశ్వరం కట్టింది వాళ్లే.. కూల్చింది వాళ్లే: బీఆర్ఎస్‎పై మంత్రి పొంగులేటి ఫైర్

Caption of Image.

హైదరాబాద్: బీఆర్ఎస్‎పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం కట్టడానికి నిధులు ఉన్నాయి కానీ పేద ప్రజలకు ఇల్లు కట్టడానికి మాత్రం డబ్బులు లేవని విమర్శించారు. లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది బీఆర్ఎసే.. కూల్చింది బీఆర్ఎసేనని అన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలో ఎనిమిదో వింత అన్నా కేసీఆర్.. ఆ ప్రాజెక్ట్ కుంగుబాటుపై చర్చించేందు మాత్రం అసెంబ్లీకి రావడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కట్టిన అది ప్రజల సొమ్ముతోనేనని అన్నారు. సోమవారం (జులై 6)  సిద్దిపేట జిల్లాలోని ములుగులో లబ్ధిదారులకు మంత్రులు పొంగులేటి, వివేక్ ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. మీరు అందించిన దీవెనలతో ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. 

పదేళ్లలో పేదోడి సొంత ఇంటి కళ కలగానే మిగిలిందని.. కాంగ్రెస్ హయాంలో పేదల సొంత ఇంటి కళ నెరవేరుస్తున్నామన్నారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. మీరు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి విడతల వారిగా ఇందిరమ్మ ఇండ్ల అందజేస్తామని హామీ ఇచ్చారు. 

©️ VIL Media Pvt Ltd.