Reading Time: < 1 minute
Oil Price Hike Cooking Oil Prices Rise By Rs 10 Per Litre Amid Iran Israel War Impact

ఇరాన్ యుద్ధం గ్యాస్ ధరలపైనే కాదు వంట నూనెలపై సైతం ప్రభావం చూపిస్తుంది. ఇరాన్‌-ఇజ్రా యెల్‌, అమెరికా యుద్ధాల ప్రభావంతో వంటకు ఉపయోగించే ఆయిల్ ధరపై ఎఫెక్ట్ చూపుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో రెండు వారాల కిందట ధరలతో పోల్చుకుంటే.. ప్యాకెట్‌కు పది రూపాయలు అదనంగా పెంచి అమ్ముతున్నారు. దాంతో జనాలు గగ్గోలు పెడుతున్నారు. వంట నూనె తప్పనిసరి కాబట్టి.. ఎక్కువ పెట్టైనా తప్పక కొన్సాల్సిన పరిస్థితి నెలకొంది.

యుద్ధం కొనసాగితే వంట నూనె ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయడం వల్ల ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏలూరు జిల్లాకు వంట నూనెకు సంబంధించిన ముడిసరుకు జలమార్గం ద్వారానే జరుగుతుంది. యుద్ధం రాకముందే సాధారణంగానే వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. ఆ మధ్య లీటర్ ప్యాకెట్‌ ధర రూ.120కి తక్కువగా ఉండగా.. కొన్ని రోజులకు రూ.14-150కి చేరింది. ఇప్పుడు లీటర్ ప్యాకెట్‌ ధర రూ.170గా ఉంది. దీనికి పది రూపాయలు అదనంగా అమ్ముతున్నారు. యుద్ధం ఇలానే కొనసాగితే పరిస్థితి ఎలా ఉంటుందో మరి. ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. కొరత సృష్టించి బ్లాక్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Also Read: CM Chandrababu: మంత్రులు, కలెక్టర్లు ఆటిట్యూడ్ మార్చుకోవాలి.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!

మరోవైపు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో రాజమండ్రిలోని హోటల్స్ రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. అంతర్జాతీయ యుద్ద పరిస్థితులు ప్రభావంతో హోటల్స్, రెస్టారెంట్లు సంక్షోభంలో పడ్డాయి. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లు ఉదయం పూట తీసి రాత్రులు కట్టేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గ్యాస్ నిలవలు నిండుకొనడంతో ఇక హోటల్స్, రెస్టారెంట్లు మూసివేయడం తప్ప మరో మార్గం లేదని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. హోటల్స్ లో పనిచేసే కొంతమంది కార్మికులను పనిలోకి రావద్దని తిరిగి పంపేస్తున్నారు. తక్కువ గ్యాస్ తో తయారయ్యే వంటకాలు మాత్రమే కస్టమర్లకు సఫరా చేస్తున్నారు.