
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 19, 2026న విడుదలకు సిద్ధమవుతోంది.
గతంలో ‘గబ్బర్ సింగ్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన తర్వాత హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తిచేసుకుని అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది.
సెన్సార్:
పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పైనవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. విడుదలకు వారం రోజుల ముందుగానే ఈ చిత్రం ఎలాంటి సమస్యలు లేకుండా సెన్సార్ ప్రక్రియను పూర్తిచేసుకుంది. సినిమా టైటిల్‌పై కూడా సెన్సార్ బోర్డు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని సమాచారం. ఇపుడు ఈ న్యూస్ పవర్ స్టార్ అభిమానులకు, చిత్ర బృందానికి పెద్ద ఊరట కలిగించే అంశం.
సెన్సార్ అప్‌డేట్‌ను ప్రకటిస్తూ మేకర్స్ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. నిర్మాతల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. సినిమా మొత్తం నిడివి 2 గంటలు 34 నిమిషాలు. ఇందులో ఫస్ట్ హాఫ్ 1 గంట 11 నిమిషాలు, సెకండ్ హాఫ్ 1 గంట 23 నిమిషాలుగా లాక్ చేశారు. అంటే ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడవచ్చు. అయితే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు.
#UstaadBhagatSingh gets a U/A certificate ❤🔥
This summer, families are set for a blast in theatres with wholesome entertainment 💥💥
GRAND RELEASE WORLDWIDE this Ugadi – 19th MARCH, 2026 🔥#UBSOnMarch19th
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna… pic.twitter.com/9dVDWM9loK
— Mythri Movie Makers (@MythriOfficial) March 10, 2026
సెన్సార్ సభ్యుల టాక్
సెన్సార్ పూర్తి అయిన తర్వాత సినిమాపై మరింత పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా గబ్బర్ సింగ్ తరహాలో పూర్తి ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని, హరీష్ శంకర్ స్టైల్‌తో పాటు పవన్ కళ్యాణ్ ప్రత్యేక మ్యానరిజం సినిమాలో బాగా కనిపిస్తుందని సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ మాస్ మ్యానరిజం, డైలాగ్ డెలివరీని దర్శకుడు హరీష్ శంకర్ తన ప్రత్యేక ఎలివేషన్లతో అద్భుతంగా చూపించారని సెన్సార్ టాక్. అభిమానులకు ఇది విజువల్ ట్రీట్‌లా ఉంటుందని ఫిక్స్ అయిపోవొచ్చని సమాచారం.
►ALSO READ | నా కెరీర్‌కు కిక్ ఇచ్చిన పాట ఆయా షేర్: కాసర్ల శ్యామ్
సినిమా కథనం విషయానికొస్తే, ఫస్ట్ హాఫ్ ఎనర్జిటిక్ కామెడీ, స్టైలిష్ యాక్షన్ సీన్లతో వేగంగా సాగుతుందని సమాచారం. సినిమాకే హైలైట్‌గా నిలిచే ‘బంగర్’ లాంటి ఇంటర్వెల్ బ్లాక్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని టాక్.
సెకండ్ హాఫ్‌లో కథ మరింత వేగం అందుకుని సామాజిక అంశాలు, ఎమోషనల్ డ్రామాతో గ్రిప్పింగ్‌గా కొనసాగుతుందని సెన్సార్ సభ్యుల నుంచి టాక్ వినిపిస్తోంది.
ఈ మూవీలో శ్రీలీలతో పాటుగా రాశీ ఖన్నా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే పార్థిబన్, ఆశుతోష్ రాణా, గౌతమీ, నాగ మహేష్, టెంపర్ వంశీ, అవినాష్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పాటలు దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎస్.ఎస్. థమన్ అందిస్తున్నారని సమాచారం.