Reading Time: < 1 minute

పాలమూరు బిడ్డలు లేబర్ కాదు.. కోహినూర్ వజ్రాలు

Caption of Image.

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు : పాలమూరు బిడ్డలు లేబర్ కాదు.. కోహినూర్ వజ్రాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. మహబూబ్ నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఐఐఐటీ లక్ష్యంగా నిర్వహించిన 45 రోజుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.

పాలమూరు కేవలం శ్రామిక జిల్లా మాత్రమే కాదని, ఎన్నో అన్యాయాలకు గురైన చరిత్ర కలిగిన ప్రాంతమన్నారు. యువత తమ చదువుతో కొత్త చరిత్రను లిఖించాలని పిలుపునిచ్చారు. ఎస్పీ జానకి మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ముడా చైర్​పర్సన్​ లక్ష్మణ్ యాదవ్, ఐఐఐటీ ప్రిన్సిపాల్ శ్రావణ్ కుమార్ ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.