Reading Time: < 1 minute
Gautam Gambhir Says Arshdeep Singh Didnt Need To Apologize To Daryl Mitchell In Icc Mens T20 World Cup Final

Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్‌దీప్‌ సింగ్‌ మరియు మిచెల్‌ మధ్య జరిగిన వాగ్వాదంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్‌ గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్ష్‌దీప్ సింగ్.. మిచెల్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని గంభీర్ స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటన టీ20 వరల్డ్‌కప్‌ 2026 ఫైనల్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో మిచెల్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత క్రీజ్ బయటకు వచ్చిన మిచెల్‌ను రనౌట్ చేయడానికి అర్ష్‌దీప్ ప్రయత్నించాడు. అయితే బంతి స్టంప్స్‌ను తాకకుండా మిచెల్ తొడను తాకింది. దీంతో ఇద్దరి మధ్య మైదానంలో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. మ్యాచ్ అనంతరం తాను విసిరిన త్రో ఉద్దేశపూర్వకంగా కాదని అర్ష్‌దీప్ సింగ్ స్పష్టం చేస్తూ మిచెల్‌కు క్షమాపణలు చెప్పాడు.

గంభీర్ వ్యాఖ్యలు
ఈ విషయంపై టీమిండియా హెడ్‌ కోడ్ గౌతమ్‌ గంభీర్ మాట్లాడుతూ.. దేశం కోసం ఆడేటప్పుడు ఆటగాళ్లు దూకుడుగా ఉండటం సహజమని అన్నారు. వరుసగా రెండు సిక్సర్లు కొట్టినప్పుడు బౌలర్ నుంచి ప్రతిస్పందన రావడం సాధారణమని చెప్పారు. క్షమాపణ చెప్పకపోయినా ఎలాంటి సమస్య ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగేవని, అయితే ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా ప్రతి చిన్న విషయం కూడా పెద్దగా మారుతోందని గంభీర్ వ్యాఖ్యానించారు.

ఐసీసీ జరిమానా
ఈ ఘటన తర్వాత International Cricket Council అర్ష్‌దీప్ సింగ్‌పై మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. అదేవిధంగా ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. అయితే గత 24 నెలల్లో ఇది మొదటి తప్పు కావడంతో అతనిపై పెద్ద శిక్ష విధించలేదు.