Reading Time: < 1 minute
Soft Rumali Roti Recipe Step By Step Method To Make Restaurant Style Rumali Roti At Home

Rumali Roti Recipe: భారతీయ వంటకాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రత్యేక రోటీ.. రుమాలి రోటి.. ఇది చాలా సన్నగా, మృదువుగా ఉండే రోటీగా రెస్టారెంట్లు మరియు ధాబాలలో ఎక్కువగా కనిపిస్తుంది. సరైన విధంగా తయారు చేస్తే ఈ రోటీ చాలా తేలికగా, దాదాపు పారదర్శకంగా ఉంటుంది. సాధారణ గోధుమ రోటీ లేదా పరాఠా తినడం బోర్ అనిపిస్తే, రుమాలి రోటీ మంచి ఎంపికగా చెప్పుకోవాలి.. ఇంట్లోనే తక్కువ సమయంలో ఈ రుచికరమైన రోటీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు మరియు తయారీ విధానం తెలుసుకుందాం.

రుమాలి రోటీ అవసరమైన పదార్థాలు
– 3 కప్పుల గోధుమ పిండి
– 1 కప్పు మైదా పిండి
– సుమారు 2 కప్పుల నీరు (పిండిని కలపడానికి)
– పొడి పిండి (రోటీ చుట్టడానికి)

రుమాలి రోటీ తయారీ విధానం
– ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి మరియు మైదా పిండి వేసి బాగా కలపాలి.
– కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా, కొద్దిగా జిగటగా ఉండేలా పిండిని ముద్దగా కలుపుకోవాలి.
– పిండిని మూతపెట్టి 2 నుండి 3 గంటలు పక్కన ఉంచాలి. దీంతో పిండి బాగా మృదువుగా అవుతుంది.
– ఇప్పుడు పిండితో చిన్న చిన్న బంతులు చేసుకోవాలి.
– గ్యాస్‌పై పాన్‌ను తలక్రిందులుగా ఉంచి బాగా వేడి చేయాలి.
– పిండిని తీసుకుని పొడి పిండి సహాయంతో చాలా సన్నగా చుట్టాలి. రోటీ చాలా పలుచగా ఉండాలి.
– వేడిగా ఉన్న పాన్‌పై రోటీని వేసి 10–12 సెకన్లు ఎక్కువ మంటపై కాల్చాలి.
– చిన్న బుడగలు వచ్చి లేత గోధుమ రంగు వచ్చిన తర్వాత మరో వైపు తిప్పాలి.
– రెండో వైపు కూడా లేతగా కాల్చిన తర్వాత పాన్ నుంచి తీసి నాలుగు మడతలు పెట్టాలి.
ఇలా తయారైన వేడి వేడి రుమాలి రోటీను కర్రీలు, పనీర్ వంటకాలు లేదా చికెన్ గ్రేవీలతో వడ్డిస్తే మరింత రుచిగా ఉంటుంది. అసలే యుద్ధాలతో గ్యాస్‌ కొరత ఏర్పడి.. హోటళ్లు, రెస్టారెంట్లు కూడా మూత పడుతోన్న తరుణంలో.. ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు..